unidentified drones over Pa

పవన్ క్యాంపు ఆఫీస్ పై గుర్తు తెలియని డ్రోన్..!!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ కలకలం రేపింది. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం మీద శనివారం మధ్యాహ్నం 1:30 నుండి 1:50 గంటల మధ్య డ్రోన్ ఎగరినట్లు సమాచారం. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన నాయకులు, డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది ఈ విషయాన్ని డీజీపీ కార్యాలయానికి తెలపడంతో పాటు, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా సమాచారమందించారు.

డ్రోన్ సంచారం చేసిన వ్యక్తులపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన పవన్ కళ్యాణ్ భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలను రేపుతోంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ విజయవాడ బుక్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈ సమయంలో విద్యుత్ విరామం కలగడంతో అంతరాయం ఏర్పడింది. అలాగే పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు నకిలీ ఐపీఎస్ అధికారి బలివాడ సూర్యప్రకాష్ రావు హల్‌చల్ చేసాడు. ఇలా వరుసగా భద్రత వైఫల్యాలు వెలుగులోకి వస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో , అభిమానుల్లో ఆందోళన ఎక్కువైపోతోంది.

Related Posts
ఏపీలో YCP సోషల్ మీడియా కార్యకర్తల వరుస అరెస్టులు
Appointment of YCP Regional

ఏపీలో వైసీపీ సోషల్ మీడియా వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని అసత్య ప్రచారాలు , నేరాలకు పాల్పడుతుండడం తో పోలీసులు రంగంలోకి Read more

గేమ్ ఛేంజర్ విడుదలకు ముందే ₹200 కోట్లు ఆదాయం
గేమ్ ఛేంజర్ విడుదలకు ముందే ₹200 కోట్లు ఆదాయం

గేమ్ ఛేంజర్ విడుదలకు ముందు నాన్-థియేట్రికల్ ఆదాయంలో ₹200 కోట్లు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం గేమ్ ఛేంజర్ జనవరి 10, 2025న థియేటర్‌లలో విడుదల కానుంది. Read more

Career Growth : 35 ఏళ్ల తర్వాత సంతానం కష్టమే!
Men's sperm

నేటి సమాజంలో కెరీర్ అభివృద్ధి కోసం చాలా మంది పురుషులు పెళ్లిని వాయిదా వేస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటినా ఇంకా స్థిరమైన జీవితం కోసం ఎదురుచూస్తూ, Read more

భారత్ ను సందర్శించనున్న అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్
భారత్ ను సందర్శించనున్న అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్

అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) తులసి గబ్బర్డ్ ఇండో-పసిఫిక్ పర్యటనలో భాగంగా భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఆమె డొనాల్డ్ ట్రంప్ పరిపాలన నుండి ఈ పర్యటన Read more