unidentified drones over Pa

పవన్ క్యాంపు ఆఫీస్ పై గుర్తు తెలియని డ్రోన్..!!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ కలకలం రేపింది. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం మీద శనివారం మధ్యాహ్నం 1:30 నుండి 1:50 గంటల మధ్య డ్రోన్ ఎగరినట్లు సమాచారం. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన నాయకులు, డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది ఈ విషయాన్ని డీజీపీ కార్యాలయానికి తెలపడంతో పాటు, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా సమాచారమందించారు.

Advertisements

డ్రోన్ సంచారం చేసిన వ్యక్తులపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన పవన్ కళ్యాణ్ భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలను రేపుతోంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ విజయవాడ బుక్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈ సమయంలో విద్యుత్ విరామం కలగడంతో అంతరాయం ఏర్పడింది. అలాగే పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు నకిలీ ఐపీఎస్ అధికారి బలివాడ సూర్యప్రకాష్ రావు హల్‌చల్ చేసాడు. ఇలా వరుసగా భద్రత వైఫల్యాలు వెలుగులోకి వస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో , అభిమానుల్లో ఆందోళన ఎక్కువైపోతోంది.

Related Posts
బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసిన విద్యాశాఖ నారా లోకేశ్
బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసిన విద్యాశాఖ నారా లోకేశ్

బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసిన విద్యాశాఖ నారా లోకేశ్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ సెమిస్టర్ పరీక్షా పత్రం లీకేజీ వివాదం విద్యా రంగంలో Read more

భారత్ ఫోర్జ్ ప్రతినిధులతో నారా లోకేశ్ భేటీ
భారత్ ఫోర్జ్ ప్రతినిధులతో నారా లోకేశ్ భేటీ

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటనలో భాగంగా భారత్ ఫోర్జ్ సంస్థ వైస్ చైర్మన్ కళ్యాణితో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో రక్షణ పరికరాల తయారీకి Read more

వన దేవతలను దర్శించుకున్న సీతక్క
Minister Seethakka participated in the mini Medaram jatara celebration

ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర వరంగల్‌: తాడ్వాయి మండలంలోని మేడారంలో మొదలైన ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ Read more

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం బ్రేక్
Rayalaseema upliftment

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను నిరాకరించింది. ఈ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానికి విజయంగా మారిందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ Read more

×