నేటి తరం జీవనశైలి మార్పుల వల్ల షుగర్, ఊబకాయం, హైపర్‌టెన్షన్ వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా, పాకెట్లో వచ్చే ప్రాసెస్డ్ ఫుడ్, అధిక కొవ్వు, పంచదార కలిగిన ఆహార పదార్థాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వైద్యుల సూచన ప్రకారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలంటే, కొన్ని హానికరమైన ఆహార పదార్థాలను మన డైట్‌లోంచి తప్పించుకోవాల్సిన అవసరం ఉంది.

కార్బోహైడ్రేట్లు కలిగిన పదార్థాల్ని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్
వైట్ బ్రెడ్, బియ్యం, పాస్తా వంటి అధిక కార్బోహైడ్రేట్లు కలిగిన పదార్థాల్ని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అలాగే కూల్‌డ్రింక్స్, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్, ఎనర్జీ డ్రింక్స్ వంటి తీపి పదార్థాలు, అధిక కృత్రిమ రసాయనాలతో ఉండి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. చిప్స్, చిరుతిళ్లు, ప్రాసెస్డ్ ఫుడ్, వేయించిన పదార్థాలు అధిక కొవ్వుతో పాటు హానికరమైన ప్రిజర్వేటివ్‌లు కలిగి ఉంటాయి. ఇవి అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది.
మద్యం సేవించడం తగ్గించడం మంచిది
తీపి పదార్థాలైన స్వీట్లు, కేక్, చాక్లెట్లు, ఐస్క్రీమ్ వంటి వాటికి ఎక్కువగా అలవాటు పడితే డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా మద్యం సేవనాన్ని కూడా తగ్గించడం మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తాజా కూరగాయలు, పండ్లు, ప్రోటీన్ ఎక్కువగా కలిగిన ఆహారం, తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న దినుసులు తీసుకోవాలి. సమయానికి నిద్ర, ఒత్తిడి నియంత్రణ, రోజువారీ వ్యాయామం పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. మంచి జీవనశైలిని అలవర్చుకుని, అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.