ట్రోఫీకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం!

ట్రోఫీకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం!

ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది ఈ టోర్నమెంట్‌కి పాకిస్తాన్ దుబాయ్ వేదికగా అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే ఆస్ట్రేలియా జట్టుకు ఈ టోర్నమెంట్‌లో షాక్ తగిలింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కంటే ముందే ఆస్ట్రేలియా జట్టుకు ఇద్దరు కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండరని తెలుస్తోంది ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఈ టోర్నీకి దూరంగా ఉండవచ్చని సమాచారం. ఆయ‌న కాలి గాయంతో బాధపడుతున్నందున అత‌ను ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనకపోవ‌డం ఖాయంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ధృవీకరించారు.

Advertisements
ట్రోఫీకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం!
ట్రోఫీకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం!

అలాగే స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా ఈ టోర్నమెంట్‌లో పాల్గొనట్లేదని ఆస్ట్రేలియా మీడియా తెలిపింది.జోష్ కూడా చీలమండ గాయంతో బాధపడుతున్నాడు అందువల్ల అత‌ను కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు.ఇక ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరమైతే ఆస్ట్రేలియా జట్టులో పెద్ద మార్పులు ఉండవచ్చు. టోర్నీకి ముందు ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది.

ప‌రిస్థితి విష‌యాన్ని బ‌ట్టి, పాట్ కమ్మిన్స్ లేకపోవడం ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద దెబ్బ గా మారవచ్చు.ఆస్ట్రేలియా జట్టు గతంలో అన్ని టోర్నమెంట్‌లలో కమ్మిన్స్ నాయకత్వంలో విజయాలు సాధించింది. ఆయన నేతృత్వంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వన్డే ప్రపంచ కప్‌తో పాటు ఇటీవల బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో కూడా విజయం సాధించింది. కమ్మిన్స్ నాయకత్వంలో ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా ఆడింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి కమ్మిన్స్ దూరం కావడం ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.

Related Posts
 టీమిండియాకి ఊహించని దెబ్బ.. ఆస్ట్రేలియాతో ఒక టెస్టుకి రోహిత్ శర్మ దూరం?
 టీమిండియాకి ఊహించని దెబ్బ.. ఆస్ట్రేలియాతో ఒక టెస్టుకి రోహిత్ శర్మ దూరం?

భారత క్రికెట్ జట్టుకు కీలకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్ ముంగిట ఓ పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టుల Read more

రాజస్థాన్ రాయల్స్ లోకి క్రికెటర్ మాజీ కోచ్ రీ ఎంట్రీ
రాజస్థాన్ రాయల్స్ లోకి క్రికెటర్

భారత మాజీ క్రికెటర్ సాయిరాజ్ బహుతులే రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా తిరిగి చేరనున్నారు.2018 నుండి 2021 వరకు ఈ ఫ్రాంచైజీతో పని చేసిన సాయిరాజ్ Read more

babar azam: బాబర్ అజామ్ ను తొలగించలేదంటున్న పాక్ అసిస్టెంట్ కోచ్!
Babar Azam 2

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌ను ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నుండి తొలగించిన నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై తీవ్రమైన విమర్శలను తెరలేపింది. ఇంగ్లాండ్‌తో Read more

BJPలోకి అంబటి రాయుడు?
ambati rayudu

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ రంగంలో కొత్త అడుగులు వేయనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఏబీవీపీ (అఖిల భారత విద్యార్థి Read more

×