హైదరాబాద్‌లో రెండు కొత్త ఐటీ పార్కులు – శ్రీధర్ బాబు

హైదరాబాద్‌లో రెండు కొత్త ఐటీ పార్కులు – శ్రీధర్ బాబు

హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు హైటెక్ సిటీ తరహాలో రెండు కొత్త ఐటీ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. సచివాలయంలో ‘డ్యూ’ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో ₹100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్ ఐటీ హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రముఖ కంపెనీలు తమ పెట్టుబడుల కోసం తెలంగాణను ప్రాధాన్యతతో ఎంచుకుంటున్నాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కొత్త ఐటీ పార్కుల కోసం అనువైన ప్రదేశాలు మరియు అవసరమైన భూమిని నిర్ణయించేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనాన్ని చేపడుతున్నాము అని నగర శివార్లలో అనుకూల ప్రాంతాలను గుర్తించడం ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తెలిపారు. ఐటీ పార్కుల్లో అన్ని అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తామని అలాగే నగరంలోని ఏ ప్రాంతం నుంచి అయినా సులభంగా చేరుకునే విధంగా వాటిని రూపకల్పన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

తెలంగాణలో ఐటీ పార్కుల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ భూకేటాయింపుల కోసం స్పష్టమైన విధానం అవసరమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రస్తుతం భూకేటాయింపులకూ నిర్దిష్ట విధానం లేదు అని ఇది పారిశ్రామికవేత్తలకు సవాళ్లను ఎదుర్కొనిపెడుతోంది అని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించాం అని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడి మొత్తం, కంపెనీలు సృష్టించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా భూమిని కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం పెట్టుబడుల లభ్యాన్ని పెంచి, పారిశ్రామిక రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు దోహదం చేస్తుంది. తెలంగాణను పెట్టుబడుల కోసం ఆకర్షించేలా ఈ నిర్ణయాలు సహాయపడతాయి.

Related Posts
నేడు లిక్కర్ పాలసీ కేసు విచారణ.. హాజరుకానున్న కవిత
Liquor policy case hearing today. Kavitha to attend

హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట వర్చువల్‌గా ఈరోజు హాజరుకాబోతున్నారు. సీబీఐ Read more

ఈనెల 17న ఏపీ మంత్రి వర్గ సమావేశం

అమరావతి: ఈనెల 17న మరోసారి ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసారు. ముఖ్యమంత్రి నారా Read more

విద్యుత్ డిమాండ్.. తెలంగాణ చరిత్రలోనే అత్యధికం
electricity demand telangan

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 6న రాష్ట్ర రోజువారీ విద్యుత్ డిమాండ్ 15,752 మెగావాట్లకు పెరిగింది. ఇది తెలంగాణ చరిత్రలో Read more

అవినీతి నిరోధక చట్టాన్ని సస్పెండ్ చేసిన ట్రంప్
donald trump

పాత చట్టాల దుమ్ము దులుపుతున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పాత చట్టాల్లో మార్పులు చేయడం ప్రారంభించారు. తాజాగా అమెరికన్ వ్యాపారాలను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *