Two more cases of HMPV in India

భారత్‌లో మరో రెండు హెచ్‌ఎమ్‌పీవీ కేసులు

న్యూఢిల్లీ: చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు భారత్‌లోనూ క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు, అహ్మదాబాద్‌లో ఒకటి, చెన్నైలో మరో రెండు కేసులు వెలుగు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర నాగ్‌పూర్‌ లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఏడు, 14 ఏళ్ల చిన్నారులకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్‌గా తేలింది.

image
image

జనవరి 3వ తేదీన చిన్నారులకు జ్వరం, దగ్గు రావడంతో నగరంలోని రాందాస్‌పేట్‌లో గల ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికీ హెచ్‌ఎమ్‌పీవీ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలకు ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. తాజా కేసులతో కలిపి భారత్‌లో మొత్తం హెచ్‌ఎమ్‌పీవీ కేసుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఈ ఏడు పాజిటివ్‌ కేసుల్లో బాధితులంతా చిన్నారులే కావడం గమనార్హం. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

కాగా, హెచ్‌ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎదురుయ్యే వైద్యపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు సోమవారం మార్గదర్శకాలను జారీ చేశాయి. బెంగళూరులో రెండు హెచ్‌ఎంపీవీ కేసుల నేపథ్యంలో ‘ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం’ అంటూ కర్ణాటక అడ్వైజరీ జారీ చేసింది. జనం ఎక్కువ ఉన్న చోట్ల మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించింది. హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్‌ కాదని, దేశంలో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు అసాధారణంగా పెరగలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు వీడియో మెసేజ్‌ ద్వారా సూచించారు. కాగా, హెచ్‌ఎంపీవీతో పాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కొవిడ్‌-19 కేసులు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చైనా స్టేట్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది.

Related Posts
విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీపై కేంద్రం ప్రకటన
vizagsteel

కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీపై నేడు అధికారికంగా ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. విశాఖ Read more

మందు బాబులకు షాక్ ఇచ్చిన బాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మందుబాబులకు షాక్‌ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను 15 శాతం పెంచుతూ ఏపీ ఎక్సైజ్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం Read more

సైఫ్ హాస్పటల్ బిల్‌ ఎంతో తెలుసా..?
saif ali khan Hospital bill

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇటీవల కత్తిపోట్లకు గురై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి ఆయన ఇటీవల Read more

సైబర్ స్కామింగ్ ను అడ్డుకున్న త్రిసూర్ పోలీసు..
scammer

త్రిసూర్ పోలీసు శాఖ ఒక స్కామర్ చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఒక హాస్యకరమైన సంఘటన జరిగింది. ఒక స్కామర్, ముంబై పోలీసు అధికారిగా పరిచయం చేసుకుని ప్రజలను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *