Two more bailed in phone tapping case

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరికి బెయిల్

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావు, రాధాకిషన్‌రావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుతో 2 షూరిటీలు సమర్పించాలని కండీషన్ విధించింది. అలాగే పాస్‌పోర్టులు సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోలీస్‌ దర్యాప్తునకు సహకరించాలని..సాక్షులను ప్రభావితం చేయరాదు అని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఇకపోతే ఇప్పటికే అదనపు ఎస్పీ భుజంగరావు ఇప్పటికే అనారోగ్యం రీత్యా బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే రాధాకిషన్ రావు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు బెయిల్ రావాల్సి ఉంది.

image

తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తు పోలీసు ఉన్నతాధికారులను ఊచలు లెక్కబెట్టిస్తోంది. ఈ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, సస్పెండ్ అయిన అదనపు ఎస్పీలు ఎం తిరుపతన్న, ఎన్ భుజంగరావు, మాజీ డీసీపీ (టాస్క్ ఫోర్స్) రాధా కిషన్ రావులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై ఉన్న భుజంగరావు మినహా మిగిలిన నిందితులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ కేసులో అదనపు ఎస్పీ ఎం తిరుపతన్న రెగ్యులర్ బెయిల్‌పై విడుదల అయిన సంగతి తెలిసిందే.

తాజాగా ఎన్ భుజంగరావు, మాజీ డీసీపీ( టాస్క్ ఫోర్స్)రాధా కిషన్ రావులకు బెయిల్ లభించింది. అయితే బెయిల్‌కు సంబంధించి పలు కండీషన్లు విధించారు న్యాయమూర్తి. లక్ష చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలని అలాగే పాస్ పోర్టు స్వాధీనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించాలని…సాక్ష్యులను ప్రభావితం చేయరాదని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఇప్పటికే ఎన్ భుజంగరావు బయటే ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాధా కిషన్ రావు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. మరోవైపు ప్రణీత్ రావు ఇంకా జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ప్రణీత్ రావు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వెల్లడించాల్సి ఉంది.

Related Posts
తెలంగాణలో రేవంత్‌ రెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది: కేటీఆర్‌..!
ktr comments on cm revanth reddy

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడి Read more

విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న ఫిర్యాదు
buddavenkanna

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును Read more

యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం
యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఆధ్వర్యంలో యూరోపియన్ నాయకులు సోమవారం పారిస్‌లో అత్యవసర భద్రతా సమావేశానికి హాజరయ్యారు. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Read more

వీఐ “సూపర్‌హీరో” పథకం
VI launched the “Superhero” scheme

పరిశ్రమలో మొదటిసారిగా “సూపర్‌హీరో” పథకాన్ని ప్రముఖ టెలికాం ఆపరేటర్ Vi తీసుకువచ్చింది. ఇది 12 AM నుండి 12 PM మధ్య అపరిమిత డేటాను వినియోగించుకునే అవకాశం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *