Two judges who took oath in AP High Court

ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణం..

అమరావతి : ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ , డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన జడ్జిలను పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందించారు.

Advertisements
image

రాష్ట్ర హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 28 మంది పనిచేస్తున్నారు. ఇద్దరి నియమకంతో ఆ సంఖ్య 30కు చేరుకోంది. మరో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా , ఆతరువాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. ప్రకాశం జిల్లాకు చెందిన జస్టిస్‌ డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు , కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిగా హరిహరనాథ శర్మ పలు కోర్టుల్లో వివిధ సేవలను అందించారు.

కాగా, రాష్ట్ర హైకోర్టుకు ఇద్దరు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. అదనపు న్యాయమూర్తులుగా న్యాయాధికారులు అవధానం హరిహరనాథశర్మ, డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో వారిని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. కొత్త న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts
Purandeswari: పవన్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు
Purandeswari పవన్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు

Purandeswari: పవన్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజకీయ వర్గాల నుండి శుభాకాంక్షల వెల్లువ ఊహించదగినదే. కూటమి పార్టీల నేతలు, Read more

పాకిస్థాన్ vs తాలిబాన్: సరిహద్దు లో ఉద్రిక్తతలు
పాకిస్థాన్ vs తాలిబాన్: సరిహద్దు లో ఉద్రిక్తతలు

పాకిస్తాన్-తాలిబాన్ మధ్య తాజా ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) యోధులపై పాకిస్థాన్ సైన్యం తీవ్ర దాడి ప్రారంభించింది. ఈ చర్యలో 15 మంది పైగా Read more

PAK: ప్రతిసారీ పాక్ నమ్మకద్రోహమే చేసింది – మోదీ
Narendra Modi శాంతి ప్రయత్నాలను పాక్ విఫలం చేసిందన్న మోదీ

భారత్‌-పాకిస్తాన్ సంబంధాలను పునరుద్ధరించేందుకు భారత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రతిసారీ పాకిస్తాన్ నమ్మకద్రోహమే చేసిందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో Read more

Accident : IPS అధికారి దుర్మరణం
Hyderabad: హిట్ అండ్ రన్ ఘటన – యువతికి తీవ్ర గాయాలు!

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం సంచలనం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు, కారును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి Read more

×