అహ్మదాబాద్‌లో (In Ahmedabad) జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. అందువల్ల వారి శవాలను గుర్తించడం అధికారులకు కష్టతరంగా మారింది. బంధువులకు శవాన్ని అప్పగించే ప్రక్రియ దాదాపు అసాధ్యంగా మారుతోంది.ఇప్పటికే మృతదేహాల గుర్తింపులో డీఎన్ఏ పరీక్షలు (DNA tests) కీలకంగా మారాయి. కానీ ఈ పరీక్షల ప్రక్రియ కూడా అంత సులభం కాదు. శనివారం ఒకే బాడీ బ్యాగ్‌లో రెండు తలలు లభించడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. దీంతో పూర్తిగా కొత్తగా డీఎన్ఏ నమూనాలు సేకరించాల్సి వచ్చింది. దీన్ని అధికారులు అత్యంత సంక్లిష్టమైన దశగా అభివర్ణిస్తున్నారు.
తీవ్ర ఉద్వేగానికి లోనైన బంధువులు
పోస్టుమార్టం గదికి వెలుపల Saturday ఉదయం బాధితుల బంధువుల వేదన మామూలుగా లేదు. మా కుటుంబ సభ్యుడి మిగిలిన శరీర భాగాలన్నీ అప్పగించండి అంటూ ఒక వ్యక్తి వేడుకోవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. కానీ అధికారులు చేతులెత్తేశారు. శవాలు పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో, శరీర భాగాలు సమగ్రంగా ఇవ్వలేమని తేల్చిచెప్పారు.
గమనించాల్సిన మార్గదర్శకాలు విడుదల
ఈ పరిస్థితుల నేపథ్యంలో, సివిల్ ఆసుపత్రి అధికారులు శనివారం కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు. డీఎన్ఏ నమూనాలు ఇచ్చిన బంధువులకే మృతదేహాలు అప్పగించనున్నట్లు వెల్లడించారు. అత్యవసరంగా ఇతర బంధువులు రావాలంటే, ఆధార్ కార్డు మరియు సంబంధ నిరూపణ పత్రాలతో రావాల్సి ఉంటుంది.ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాల తరలింపునకు ఎయిర్ ఇండియా మరియు రోడ్డు మార్గాల ద్వారా ఉచిత రవాణా కల్పించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇది బాధిత కుటుంబాలకు కొంత ఊరటను ఇస్తుంది.
Read Also : car theft gang : ఏడాదిలో 25 కార్లు కొట్టేశారు!