Crime :ఇన్స్టాగ్రామ్ పరిచయమే..ఇద్దరు బాలికలపై అఘాయిత్యం

Crime :ఇన్స్టాగ్రామ్ పరిచయమే..ఇద్దరు బాలికలపై అఘాయిత్యం

ఇద్దరు బాలికలకు మాయమాటలు చెప్పి నమ్మించిన ఇద్దరు యువకులు వారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పరిధిలో సంచలనం రేపింది.ఆకుల సాత్విక్ (26) – దమ్మాయిగూడకు చెందిన వ్యక్తి,కర్నాటి మోహనచంద్ (28) – ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి,ఈ ఇద్దరు స్నేహితులు ఇన్స్టాగ్రామ్ ద్వారా మచ్చబొల్లారానికి చెందిన ఇద్దరు బాలికలతో పరిచయం ఏర్పరచుకున్నారు. బాధిత బాలికలు 9వ తరగతి విద్యార్థినులు, అయితే వారు మధ్యలోనే చదువు ఆపివేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం

గత ఐదు నెలలుగా ఈ యువకులు ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికలతో చాట్ చేస్తున్నారు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి నమ్మించారు. బాలికలు వారి మాటలను నమ్మి బుధవారం ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిపోయారు. అయితే రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై, వెంటనే అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణ

ఫిర్యాదు అందుకున్న పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. బాలికల ఫోన్ కాల్ రికార్డులను పరిశీలించి, వారి చివరి లొకేషన్‌ను ట్రాక్ చేయగా, వారు ఈసీఐఎల్‌లోని ఓయో లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు.అర్ధరాత్రి ప్రత్యేక బృందంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాలికలను రక్షించారు. విచారణలో యువకులు బాలికలపై అత్యాచారం చేసినట్లు స్పష్టమైంది. దీంతో ఆకుల సాత్విక్, కర్నాటి మోహనచంద్‌లను అరెస్టు చేసి, వారిపై పోక్సో చట్టం (ప్రొటెక్షన్ అఫ్ చిల్డ్రన్ ఫ్రొమ్ సెక్సువల్ ఆఫెన్సెస్ ఆక్ట్), కిడ్నాప్ కేసులు నమోదు చేశారు.

86228165

బాలికలకు వైద్య పరీక్షలు

బాధిత బాలికలను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అంతేకాక, నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి వయసు ధృవీకరణ లేకుండానే బాలికలను లాడ్జిలోకి అనుమతించిన ఓయో హోటల్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియా

ఈ ఘటన యువతకు మరియు తల్లిదండ్రులకు పాఠంగా మారాలి. సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, పిల్లలపై తల్లిదండ్రులు కట్టుదిట్టమైన పర్యవేక్షణ కలిగి ఉండాలి.ఇంటర్నెట్‌లో ఎవరితో చాట్ చేస్తున్నారు?ఎటువంటి సమాచారాన్ని పంచుకుంటున్నారు?ఎవరితో బయటికి వెళుతున్నారు?
ఇలాంటి విషయాలపై తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిశీలించాలి.

Related Posts
Vadodara :నేను తాగలేదు గుంతలే ప్రమాదానికి కారణం..వడోదర నిందితుడి వ్యాఖ్యలు
నేను తాగలేదు గుంతలే ప్రమాదానికి కారణం..వడోదర నిందితుడి వ్యాఖ్యలు

గుజరాత్‌లోని వడోదరలో కారు బీభత్సానికి ఒక మహిళ మృతి చెందగా.. 8 మంది అరెస్ట్ అయ్యారు. ఈ ప్రమాదం తర్వాత నిందితుడు రక్షిత్ చౌరాసియా.. నడిరోడ్డుపై చేసిన Read more

నకిలీ కాల్స్ సెంటర్ గుట్టు రట్టు
నకిలీ కాల్స్ సెంటర్ గుట్టు రట్టు

నకిలీ కాల్సెంటర్ దందా: 63 మందిని అరెస్ట్ చేసిన టీజీ సైబర్ సెక్యూరిటీ హైదరాబాద్ నగరంలో మరోసారి నకిలీ కాల్సెంటర్ల విషయంలో సంచలనం కలిగే ఘటన ఒకటి Read more

బాపూ ఘాట్‌లో భారీ మహాత్మా గాంధీజీ విగ్రహం ఏర్పాటు – సీఎం రేవంత్
gandhi statue

ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. ఆయన హైదరాబాద్‌లోని బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి Read more

ప్రజావాణిలో 27వేలకు పైగా సమస్యలకు పరిష్కారం – డిప్యూటీ సీఎం భట్టి
bhattiprajavani

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమం ఆశాజనక ఫలితాలను సాధిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి తెలిపిన దాని ప్రకారం.. ఈ పథకం ద్వారా 27 వేలకుపైగా సమస్యలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *