నారా లోకేశ్ చొరవతో మంగళగిరికి రెండు ఎలక్ట్రిక్ బస్సులు

నారా లోకేశ్ చొరవతో మంగళగిరికి రెండు ఎలక్ట్రిక్ బస్సులు

నారా లోకేశ్ చొరవతో మంగళగిరికి రెండు ఎలక్ట్రిక్ బస్సులు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఉండవల్లి నివాసంలో జెండా ఊపి ఈ సేవలను ప్రారంభించిన లోకేశ్, ప్రజల ప్రయాణ సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పిటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాకపోకల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన మంత్రి లోకేశ్, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా బస్సులను సమకూర్చాలని మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (MEIL) సంస్థను అభ్యర్థించారు. లోకేశ్ విజ్ఞప్తికి స్పందించిన MEIL ఫౌండేషన్, రూ.2.4 కోట్ల విలువైన రెండు అత్యాధునిక Olectra 7 మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది.ఈ ఉచిత బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్ వరకు నడుస్తుంది.

నారా లోకేశ్ చొరవతో మంగళగిరికి రెండు ఎలక్ట్రిక్ బస్సులు
నారా లోకేశ్ చొరవతో మంగళగిరికి రెండు ఎలక్ట్రిక్ బస్సులు

ఈ బస్సులలో ఒక్కో బస్సు 18 మంది ప్రయాణికుల

మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి ఆలయానికి సేవలు అందిస్తుంది.ఎయిమ్స్ వెళ్లే బస్సు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.అలాగే పానకాలస్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది. ఈ బస్సులలో ఒక్కో బస్సు 18 మంది ప్రయాణికులను ఒకేసారి తీసుకెళ్లగలదు. పూర్తిగా ఛార్జింగ్ చేస్తే, 150 కి.మీ. వరకు ప్రయాణించగల సామర్థ్యం ఈ బస్సులకు ఉంది.ఈ బస్సులు డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ (EHPS), రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ (VTS), రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్స్ (RPAS) వంటి ఆధునిక భద్రతా సౌకర్యాలతో అందించబడ్డాయి.

ఈ ఉచిత బస్సు సేవల ద్వారా మంగళగిరి

ఈ కార్యక్రమంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ K.V. ప్రదీప్, ఎయిమ్స్ డైరక్టర్ శాంతా సింగ్, డిప్యూటీ డైరక్టర్ శశికాంత్, లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ. కోటిరెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ఉచిత బస్సు సేవల ద్వారా మంగళగిరి, ఉండవల్లి పరిధిలోని ప్రజలకు మరింత ప్రయాణ సౌకర్యం కలుగుతుందని, ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికీ ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుందని మంత్రి లోకేశ్ తెలిపారు.

Related Posts
ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్‌ వర్మ మరో పిటిషన్ !
Another petition of Ram Gopal Varma in AP High Court

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని రామ్‌గోపాల్‌ Read more

భార్య భువనేశ్వరికి చంద్రబాబు ఉమెన్స్ డే గిఫ్ట్
Chandrababu's Women's Day gift to wife Bhuvaneswari

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరి కి చీర కొనుగోలు చేశారు. జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా తన భార్యకు ఆయన గిఫ్ట్ Read more

క్షమాపణలు చెప్పిన హీరో విశ్వక్ సేన్‌
క్షమాపణలు చెప్పిన హీరో విశ్వక్ సేన్‌

ఇటీవల కాలంలో సినిమా ఫంక్షన్స్‌లో రాజకీయా ప్రసంగాలు ఎక్కువైయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీని టార్గెట్ చేసుకుని పలువురు Read more

ఏపీలో కీలకమైన 6 రైళ్లు రద్దు
4 more special trains for Sankranti

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ క్రమంలో నిత్యం తిరుగుతున్న కొన్ని రైళ్లను రద్దుచేసి కుంభమేళాకు పంపిస్తోంది. Read more