Vijay Speech : మదురైలో ఆగస్టు 21, 2025న జరిగిన టీవీకే రాష్ట్ర సదస్సులో పార్టీ స్థాపకుడు, (Vijay Speech) నటుడు విజయ్ మాట్లాడారు. ఆయన తొలిసారి ఎఐఏడీఎంకేపై నేరుగా దాడి కి దిగారు.
ఈ సందర్భముగా విజయ్ మాట్లాడుతూ, “ఎంజీఆర్ స్థాపించిన ఎఐఏడీఎంకే ఆయన బ్రతికినంతవరకు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అదే పార్టీ బీజేపీ అనే ‘ఫాసిస్టు పార్టీ’తో కలిసింది. ఇది కేడర్లకు కూడా నచ్చలేదు” అని విజయ్ అన్నారు.
అదే సమయంలో ఆయన ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)పై కూడా విమర్శలు గుప్పించారు. “ప్రస్తుత ప్రభుత్వం అసత్య ప్రచారం మాత్రమే చేస్తోంది. మహిళలకు, పిల్లలకు భద్రత లేదు. అవినీతి ఎక్కువైంది” అని ఆరోపించారు.
2026లో జరగబోయే ఎన్నికల్లో టీవీకే (TVK) – DMK మధ్య నేరుగా పోరు ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు. “మా పార్టీ బీజేపీతో లేదా డీఎంకేతో ఎప్పటికీ కూటమి కుదరదు. మా పార్టీకి ప్రజల మద్దతు ఉంది” అని అన్నారు.
Read also :