Turmeric Board is not getting any legitimacy or benefits.. Kavitha

పసుపు బోర్డుకు చట్టబద్ధత లేక ప్రయోజనాలు అందడం లేదు: కవిత

హైదరాబాద్‌: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత తాజాగా నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలపై స్పందించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. క్వింటాలు పసుపుకు రూ.15వేల ధర కల్పిస్తామని ఎన్నికల టైంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ గురించి ప్రశ్నించారు.

Advertisements
పసుపు బోర్డుకు చట్టబద్ధత లేక

కవిత వ్యాఖ్యలు

కనీసం రైతులను పరామర్శించడం లేదు

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు తెచ్చామని చెప్పుకుంటున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని ఫైర్ అయ్యారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేక రైతులకు ప్రయోజనాలు అందడం లేదన్నారు. పసుపునకు మద్దతు ధర పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. వెంటనే ఆ హామీని నిలబెట్టుకోవాలని ఆమె బండి సంజయ్‌ను నిలదీశారు.

Related Posts
వల్లభనేని వంశీ అరెస్ట్ – అసలేమైందో తెలుసా?
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ – రాజకీయ వర్గాల్లో కలకలం

తెలంగాణ, 13 ఫిబ్రవరి 2025:ప్రముఖ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది.అరెస్టుకు Read more

జీహెచ్ఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం
జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం

హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మరియు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 91-ఏ Read more

జేసీకి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్
జేసీకి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివాదం చెలరేగింది. నటి, బీజేపీ నేత మాధవీలతపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి Read more

ఏపీలో ఈనెల 3 నుంచి దసరా సెలవులు!
school holidays in august

Dussehra holidays in AP from 3rd of this month! అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీలో దసరా Read more

Advertisements
×