తెలంగాణలో నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగం లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పైకప్పు కూలిపోవడంతో టన్నెల్ లోపల నీరు, మట్టి చేరి ఆరుగురు కార్మికులు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 8 మంది కార్మికులు సొరంగం లోపలే చిక్కుకుపోయారు. సహాయక చర్యల్లో భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సమిష్టిగా పనిచేస్తున్నాయి.

ఘటన ఎలా జరిగింది?
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ప్రాజెక్టులో భాగంగా పనులు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా టన్నెల్ పైకప్పు కూలిపోయింది. దీని ప్రభావంతో 10 బ్లాకులు దాదాపు 100 మీటర్ల మేర నేలమట్టమయ్యాయి. లోపల భారీగా నీరు, మట్టి చేరడంతో కార్మికులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.
ప్రమాదానికి గల కారణాలు
ఈనెల 18వ తేదీన నాలుగేళ్ల విరామం తర్వాత పునఃప్రారంభమైన పనుల సమయంలోనే ప్రమాదం సంభవించింది. టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో 10 బ్లాకులు దెబ్బతిన్నాయి. దాదాపు 100 మీటర్ల మేర మట్టి, నీరు కూరుకుపోయాయి. ఈ ప్రమాదంలో 12 మందికి పైగా గాయపడ్డారు.
భారత సైన్యం రంగంలోకి
భారీగా నీరు చేరడంతో సహాయక చర్యలు మరింత క్లిష్టతరమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యానికి చెందిన బైసన్ డివిజన్ ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ (ETF) రంగంలోకి దిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఎక్స్కవేటర్లు, JCBలు, బుల్డోజర్లు సహాయంతో శిథిలాలను తొలగించేందుకు యత్నిస్తున్నారు.
సహాయక చర్యలు
కార్మికులను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలుసొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు పంపింగ్ సెట్లు, సాయుధ గొట్టాలు, ఆక్సిజన్ సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
సొరంగంలో చిక్కుకున్న కార్మికులు
సహాయక బృందాలు విడుదల చేసిన సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాబితా
మనోజ్ కుమార్, శ్రీనివాస్ (ఉత్తరప్రదేశ్)
సంతోష్ సాహు, అనూజ్ సాహు, సందీప్ సాహు, జక్తా ఎక్సెస్ (జార్ఖండ్)
సన్నీ సింగ్ (జమ్మూకాశ్మీర్)
సన్నీ సింగ్ (పంజాబ్)
రక్షణ చర్యలు వేగవంతం
ప్రస్తుతం సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపడుతున్నాయి. అధికారులు సురంగంలోకి ప్రవేశించి కార్మికుల ప్రాణాలు కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నాయి.
ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
ఈ ఘటన భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా టన్నెల్ భద్రతా పరీక్షలు, నిర్మాణ నాణ్యత ప్రమాణాలను పటిష్టంగా పాటించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు కలిసి నిర్మాణ పనుల్లో సేఫ్టీ గైడ్‌లైన్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలి. టన్నెల్ భద్రతపై ప్రత్యేక నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ బృందాలను నియమించాలి. ఈ ప్రమాదం భద్రతా ప్రమాణాల పరంగా దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపింది. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రమాద నివారణ చర్యలు మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది.