हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Tunga Bhadra: తుంగ భద్రకు పొంచి ఉన్న ముప్పు.. భయం గుప్పిట్లో ప్రజలు

Anusha
Tunga Bhadra: తుంగ భద్రకు పొంచి ఉన్న ముప్పు.. భయం గుప్పిట్లో ప్రజలు

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాణాధారంగా నిలిచిన తుంగభద్ర ప్రాజెక్టు ప్రస్తుతం తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. సాగునీరు, తాగునీటిని అందించే ఈ జలాశయానికి ఉన్న మొత్తం 33 గేట్లలో ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా సాంకేతిక లోపాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇంజినీర్లు వెల్లడించిన వివరాల ప్రకారం ఇంకా ఏడు గేట్లు (Seven gates) పనిచేయకపోవడం వల్ల జలాశయం భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.గతేడాది ఆగస్టు 10న కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో స్టాప్‌లాగ్‌లను ఏర్పాటు చేసి నీటిని నియంత్రించడం జరిగింది. ఆ ఘటన తరువాత గేట్ల స్థితి పట్ల నిపుణులు,అధ్యయనం చేసి, వచ్చే ఏడాది జూన్ నాటికి మొత్తం 33 గేట్లను పూర్తిగా మార్చాల్సిందే అని స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఒకవేళ వరదల సందర్భంలో

ఆ దిశగా గదగలో కొత్త గేట్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే నిర్మాణానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రస్తుత వర్షాకాలంలో ప్రాజెక్టు భద్రతపై అనిశ్చితి నెలకొంది.ఇంజినీర్ల నివేదిక ప్రకారం 4, 11, 18, 20, 24, 27, 28 నెంబర్ల గేట్లు పూర్తిగా పనిచేయడం మానేశాయి. ఒకవేళ వరదల సందర్భంలో (floods) ఈ గేట్లను ఎత్తే ప్రయత్నం చేస్తే ప్రమాదకర పరిస్థితి తలెత్తే అవకాశముందని నిపుణులు స్పష్టంగా తెలిపారు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ గేట్లను ఎత్తకూడదని నిర్ణయించారు. అయితే 4వ గేటును మాత్రం తాత్కాలికంగా ఒక అడుగు మేర మాత్రమే ఎత్తవచ్చని, ఆ తర్వాత అది కూడా సరిగా పనిచేయలేకపోతుందని అధికారులు చెబుతున్నారు.

Tunga Bhadra
Tunga Bhadra

మరింత వరద పెరిగే అవకాశం ఉంది

ప్రస్తుతం జలాశయానికి ఎగువున కురుస్తున్న వర్షాల మూలంగా23 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో మూడు గేట్లను మాత్రమే పైకెత్తి 9 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మిగిలిన వరదను కాలువలకు వదులుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏ క్షణంలోనైనా డ్యాంకు మరింత వరద పెరిగే అవకాశం ఉంది. నిరుడు లక్ష క్యూసెక్కుల వరద వచ్చిన సమయంలో 19వ గేటు కొట్టుకుపోయింది. ఇప్పుడూ అదే స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉండడం, గేట్లు దెబ్బతినడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వరద నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపితే ప్రమాద తీవ్రత అంతగా ఉండకపోవచ్చని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు.

తుంగభద్ర ఏ నదుల కలయికతో ఏర్పడింది?

కర్ణాటకలో తుంగ, భద్ర అనే రెండు నదులు కలసి తుంగభద్ర నదిగా ఏర్పడతాయి.

తుంగభద్ర నది పొడవు ఎంత?

తుంగభద్ర నది సుమారు 531 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/papan-and-lokesh-say-they-will-buy-the-ticket-themselves/andhra-pradesh/530873/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870