TTD : తెలంగాణ ప్రజలకు టీటీడీ శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తాజాగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త అందించింది. ఇకపై తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల ద్వారా కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం పొందే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం మార్చి 24వ తేదీ నుంచి అమలులోకి రానుంది.తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ ప్రత్యేక ప్రాధాన్యత గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆదేశాలు, టీటీడీ ఛైర్మన్ బీఅర్ నాయుడు చొరవతో ఇప్పుడు ఈ కొత్త విధానం అమలుకానుంది. ఈ నిర్ణయం భక్తులకూ, ప్రజాప్రతినిధులకు సంతోషకరంగా మారింది.

సిఫార్సు లేఖలతో దర్శన ఏర్పాట్లు
సోమ, మంగళవారాల్లో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు కానుంది.బుధ, గురువారాల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం అందుబాటులోకి రానుంది.
ఒక్క ప్రజాప్రతినిధి లేఖపై గరిష్టంగా ఆరుగురికి మాత్రమే దర్శన అనుమతి.
ఏపీ ప్రజాప్రతినిధుల దర్శనాల్లో మార్పులు
అంతే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల దర్శన విధానంలో మార్పులు చేశారు. ఇప్పటి వరకు సోమవారం ఏపీ ప్రజాప్రతినిధుల దర్శనానికి అనుమతి ఉండేది. కానీ, కొత్త మార్పుల ప్రకారం ఇకపై ఆదివారం దర్శనం కోసం, శనివారం సిఫార్సు లేఖలు స్వీకరించనుంది.
భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ ప్రయోజనకరంగా మారనుంది.ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గ భక్తులకు తక్కువ సమయంలో స్వామివారి దర్శనం సౌకర్యాన్ని కల్పించగలుగుతారు. ఇది భక్తుల కోసం ప్రభుత్వం, టీటీడీ కలసికట్టుగా తీసుకున్న మంచి నిర్ణయం అని చెప్పొచ్చు.