తిరుమల :అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, ఆపద మొక్కులవాడు, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం రానున్న అక్టోబర్నెలకు సంబంధించి ఆన్లైన్ టిక్కెట్లు ఈనెల 19వతేదీ శనివారం విడుదల చేయనుంది. అక్టోబర్ నెలకోటాను 19వతేదీ ఉదయం 10గంటలకు విడుదల చేసేలా టిటిడి ఐటి విభాగం ఏర్పాట్లుచేసింది. ఆర్జిత సేవాటిక్కెట్లు (Arjitha seva tickets) ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21వతేదీ సోమవారం ఉదయం 10గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టిక్కెట్లు పొందిన భక్తులు 21వతేదీ నుండి 23వతేదీ మధ్యాహ్నం 12గంటల లోపు లక్కీడిప్ ద్వారా టిక్కెట్లు పొందిన భక్తులు నగదు చెల్లించి టిక్కెట్లు అందుకోవచ్చు. ఇక ఆర్జితసేవా కల్యాణం, ఊంజల్సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవల టిక్కెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈనెల 22వతేదీ ఉదయం,10గంటలకు విడుదల చేస్తారు.

ఆన్లైన్లోనే విడుదల చేస్తున్న విషయం
వర్చువల్ సేవల టిక్కెట్లు 22న మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అంగప్రదక్షణ టోకెన్లను 23వతేదీ ఉదయం 10గంటలకు విడుదల చేస్తోంది. రోజువారీగా (శుక్రవారం తప్ప)750 టోకెన్లను ఆన్లైన్లోనే విడుదల చేస్తున్న విషయం విదితమే. ఇదిలా ఉండగా శ్రీవాణి టిక్కెట్లు (Srivani Tickets) ఆన్లైన్లో 23వతేదీ ఉదయం 11గంటలకు విడుదల చేస్తారు. 300 రూపాయలు ఎస్ఇడి టిక్కెట్లు కోటా 24వతేదీ ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. దివ్యాంగులు,వృద్ధుల కోటా 23న మద్యాహ్నం 3గంటలకు, 24న గదుల కోటా విడుదలచేస్తారు.25న శ్రీవారి సేవా కోటా విడుదలవుతుంది. భక్తులు ఆర్జితసేవలు, దర్శన టిక్కెట్ల (Darshan tickets) ను ఆన్లైన్లో టిటిదేవస్థానమ్స్. ఎపి.జిఒవి. ఇన్ వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోవాలని టిటిడి కోరింది.
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్ర?
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చరిత్ర చాలా పురాతనమైనది.ఇది శ్రీవారి ఆలయం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఈ ఆలయం ప్రపంచంలోనే ధనిక పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయ చరిత్రను పరిశీలిస్తే, తొండమాన్ చక్రవర్తి దీనిని నిర్మించాడని, ఆ తర్వాత చోళులు, పాండ్యులు,విజయనగర రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారని తెలుస్తోంది. రామానుజాచార్యులు 11వ శతాబ్దంలో ఆలయ ఆచారాలను రూపొందించారు.
తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్ర?
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక పురాతనమైన, ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో, తిరుమల కొండలపై ఉంది. ఈ ఆలయం విష్ణువు అవతారమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. కలియుగంలో ప్రజల కష్టాలను తొలగించడానికి వెంకటేశ్వరుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని భక్తులు నమ్ముతారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Nellimarla Commissioner: ఎసిబి వలలో నెల్లిమర్ల కమిషనర్