TTD introduced masala vada in Tirumala Annaprasadam?

ఇక పై తిరుమల అన్నప్రసాదంలో వడలు ?

తిరుమల: శ్రీవారి భక్తులకు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఈ నెల 6 నుంచి వడలు కూడా అందించనున్నట్లు సమాచారం. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ట్రయల్ రన్‌లో భాగంగా దాదాపు 5వేల మంది భక్తులకు ఉల్లిపాయలు వాడకుండా చేసిన మసాలా వడలను వడ్డించారు. ఇక, ఈ నెల 6వ తేదీ నుంచి పూర్తి స్థాయి అమల్లోకి తెచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా తిరుమలలో మంచి నీటి కోసం వినియోగిస్తున్న గాజు సీసాల స్థానంలో కొత్తగా టెట్రా ప్యాకెట్ లు అందుబాటు లోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. త్వరలోనే ఈ విధానం అమల్లోకి రానుంది.

Advertisements
ఇక పై తిరుమల అన్నప్రసాదంలో

తెలంగాణ నేతలు ఆగ్రహం

తిరుమలలో శ్రీవారి బ్రేక్ దర్శనాల కోసం టీటీడీ పైన ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై కూడా వీఐపీ బ్రేక్‌, రూ.300 దర్శన టికెట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో మరింతగా లేఖల సంఖ్య పెరుగుతోంది. ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. తమ లేఖలు తీసుకోవటం లేదని తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి ఏపీ ప్రజాప్రతినిధుల ద్వారానే 1,800 నుంచి 2 వేల వరకు బ్రేక్‌ దర్శనాలకు టికెట్లు ఇస్తున్నట్లు సమాచారం.

పెరిగిన బ్రేక్‌ దర్శన సిఫారసులు

అన్ని కేటగిరీల్లోనూ వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రోజుకు దాదాపు 7 వేల నుంచి 7,500 వరకు ఇవ్వాల్సి వస్తుందని వాపోతున్నారు. వీరందరికీ దర్శనం చేయించడానికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమయం తీసుకుంటున్నారు. పెరిగిన బ్రేక్‌ దర్శన సిఫారసులను ఎక్కడ తగ్గించాలో అర్థంకాక టీటీడీ అధికారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో.. తెలంగాణ సిఫార్సు లేఖలతో వస్తున్న భక్తులు తమ లేఖలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts
అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం
shabarimala temple

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఈ ఏడాది కేరళ ప్రభుత్వం కీలక మార్పును అమలు చేసింది. భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అయ్యప్ప దర్శనానికి ఆన్‌లైన్ Read more

త్యాగానికి, సేవకు ప్రతీక పోలీసులు: సీఎం రేవంత్ రెడ్డి
Police are a symbol of sacrifice and service. CM Revanth Reddy

హైదరాబాద్‌: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా గోషామహల్ పోలీస్ Read more

వీరికే నామినేటెడ్ పదవులు- చంద్రబాబు
chandra babu

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు విడతలుగా నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసింది. ఇప్పుడు మూడో విడత పోస్టుల భర్తీ కోసం కసరత్తు చేస్తోంది. ఈ Read more

మేలో తల్లికి వందనం.. చంద్రబాబు కీలక ప్రకటన
మేలో తల్లికి వందనం.. చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. తల్లికి వందనం నిబంధనలపై క్లారిటీ ఇచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన Read more

×