టిటిడి గోశాలలో గోవుల మృతి – వివాద ప్రారంభం
దేవునితో సమానంగా, గోమాతను తల్లిలా భావించి పూజించే తిరుమల తిరుపతిదేవస్థానం ఆధ్వర్యంలోని ఎస్వీ గోశాలలో Govula సహజ మరణాలను రాజకీయాలకు ఆపాదించడం సరైందికాదని టిటిడి ఈఒ జె. శ్యామలరావు స్పష్టం చేశారు. టిటిడి గోశాలలో వంద ఆవులు అనుమానాస్పదంగా మృతి చెందాయని, టిటిడి ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతో మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో చేసిన ఆరోపణలను ఇఒ తోసిపుచ్చారు. గత మూడునెలల కాలంలో (జనవరి, ఫిబ్రవరి, మార్చి) వయోభారం, వ్యాధుల కారణంగా 43 గోవులు మృతి చెందాయన్నారు. అవన్నీ సహజ మరణాలేనని తెలిపారు. 2024 నాటికి 179 గోవులు మరణించగా, గత టిటిడి ట్రస్ట్ బోర్డు బయటపెట్టలేదని చెప్పారు. కాలం చెల్లిన మందులు, పాచిపట్టిన నీరు, పురుగులుపడ్డ దాణా అందించారని ఇఒ సంచలన వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన Govula వివరాలను నమోదు చేయలేదని అన్నారు. టిటిడి విజిలెన్స్ నివేదికల్లో నమోదైనా ఎలాంటి చర్యలుచర్యలు తీసకుండా విస్మరించారని
తెలిపారు. గత ఐదేళ్లలో తీవ్ర వ్యాధులతో ఉన్న Govula ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమైనా ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు.

గత ఐదేళ్లలో గోశాలలో అవినీతి, నిర్లక్ష్యం
గత ప్రభుత్వ హయాంలో తిరుమల గోశాలలో గోదాణా కాంట్రాక్టర్ వద్ద 78 లక్షల రూపాయలు కమీషన్ నొక్కేశారని శ్యామలరావు సంచలన ఆరోపణ చేశారు. గత ఐదేళ్ళలో ఎస్వీ గోశాలలో అపరిశుభ్ర వాతావరణం తాండవించిందన్నారు. సోమవారంమధ్యాహ్నం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో ఇవి శ్యామలరావు గోవులు, మృతిపై మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. గత ఐదేళ్లలో జరిగిన అవినీతి అక్రమాలు కూడా వెల్లడించారు. Govula మృతిపై ఫోటోలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. టిటిడి గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇఒ శ్యామలరావు అన్నారు. గత ఐదేళ్లలో గోశాలలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. కనీసం విజిలెన్స్ విచారణకు కూడా అప్పటి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్లు, గోశాల డైరెక్టర్ హరనాధరెడ్డి అనుమతించలేదని ఇఒ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోశాలలో గోవులకు కాలం చెల్లిన మందులు ఇచ్చినట్లు రికార్డులు ఉన్నాయన్నారు. కాటలేబుల్లు కూడా లేని మందులు గోవులకు ఉపయోగించారు. అప్పట్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండు సార్లు గోశాలలో అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు. దాణా, మందుల సరఫరా కాంట్రాక్టులోనూ భారీగా అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇప్పుడు వీటిపై చర్యలు చేపట్టామన్నారు.
హిందూ మనోభావాలపై ప్రభావం
గతంలో విజిలెన్స్ అధికారులను గోశాలలోనికి అనుమతించలేదని, ఇప్పుడు ఎవరైనా గోశాలకు వెళ్ళి సందర్శించవచ్చని అన్నారు. ప్రస్తుతం పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని ఇఒ తెలిపారు. గోవులు ప్రతినెలా సగటున 15 ఆవులు వయోభారం, వ్యాధులతో చనిపోతాయని చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 54 లేగదూడలు జన్మించాయన్నారు. అయితే మాజీ ఛైర్మన్ చేసిన నిరాధారణమైన ఆరోపణలు దురదృష్టకరమన్నారు.
Read more: Bhumana Karunakar Reddy: మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన భూమన