TTD gears up for ‘Vaikunta Dwara Darshan from January 10 to 19

జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమల: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సోమవారం అధికారులతో సమీక్షించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి కావడంతో ఆ రోజు నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు కల్పించనున్నారు. ఈ పదిరోజుల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు (స్వయంగా వచ్చే ప్రొటోకాల్‌ ప్రముఖులకు మినహా) చేసినట్టు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అలాగే, చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, డిఫెన్స్‌, ఎన్‌ఆర్‌ఐ దర్శనాలతో పాటు ఆర్జితసేవలు రద్దు చేస్తున్నట్టు చెప్పారు.

Advertisements

వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదాల వితరణ చేయాలని అధికారులకు సూచించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో ఇంకోసారి సమీక్షిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్‌వో శ్రీధర్, సీఈ సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరోవైపు వైకుంఠ ఏకాదశికి నలబై రోజులు మాత్రమే ఉండటంతో సన్నద్ధం కావాలని ఆయా శాఖల అధికారులందరినీ ఆదేశించారు. వైకుంఠ ఏకాదశికి సరిపోయే పూల అలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్‌లను నియమించడం, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై కూడా ఆయన చర్చించారు.

Related Posts
బొత్స మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది : షర్మిల
బొత్స మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది : షర్మిల

తనపై బొత్స చేసిన కామెంట్స్‌పై షర్మిల కౌంటర్‌ అమరావతి: వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్ Read more

అమెరికాలో విపత్తులో భారీ నష్టం
అమెరికాలో విపత్తులో భారీ నష్టం

లాస్ ఏంజిల్స్ అడవి మంటలు, అమెరికాలోని అత్యంత ఖరీదైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా మారాయని బ్లూమ్బెర్గ్ ప్రాథమిక ఆర్థిక అంచనాలను ఉటంకిస్తూ నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ మంటలు Read more

Tihar Jail : మరో చోటుకు తిహార్ జైలు తరలింపు
tihar jail

ఆసియాలోనే అతిపెద్దదైన తిహార్ జైలును మరో ప్రాంతానికి తరలించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో కొత్త జైలు నిర్మాణానికి అవకాశం ఉండడంతో, ప్రభుత్వం దీనికి Read more

కుంభమేళాలో సరికొత్త రికార్డ్!
కుంభమేళాలో సరికొత్త రికార్డ్!

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా భక్తులతో కిటకిటలాడుతోంది. మూడో రోజుకు చేరుకున్న ఈ పవిత్ర వేడుకకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి, నదీమతల్లికి హారతులు Read more

×