TTD discrimination against Telangana public representatives is inappropriate.. Raghunandan Rao

Raghunandan : తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష తగదు: రఘునందన్ రావు

Raghunandan : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది వెళ్తుంటారు. దేశ విదేశాల నుంచి కూడా వెంకన్న దర్శనాకి భక్తులు వస్తారు. ఇక, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున శ్రీవారి దర్శనానికి వెళ్తారు. కానీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించకపోవడం పెద్ద రచ్చగా మారింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం. టీటీడీ పాలక మండలి కూడా నిర్ణయం తీసుకున్నా.. ఇది అమల్లోకి రాకపోవడంపై తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అసహనం వ్యక్తం చేశారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పరిగణలోకి తీసుకుంటామని పాలకమండలి నిర్ణయం తీసుకుంది.కానీ, ఇంత వరకు అమలు చేయలేదు.. ఉమ్మడి రాష్ర్టంలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకున్న టీటీడీ ఇప్పుడు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

Raghunandan  తెలంగాణ ప్రజా ప్రతినిధుల

వేసవి సెలవులో సిఫార్సు లేఖలు

ఇక, సీఎం ఆదేశించినా.. పాలకమండలి నిర్ణయం తీసుకున్నా.. టీటీడీ అధికారులు ఎందుకు అమలు చేయడం లేదు అని రఘునందన్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష తగదన్న ఆయన పాలకమండలి అత్యవసర సమావేశమై నిర్ణయం అమలు చేయాలని సూచించారు. వేసవి సెలవులో సిఫార్సు లేఖలు ఇస్తాం.. పరిగణలోకి తీసుకోకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులం అందరం తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం అని వార్నింగ్‌ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు. మరోవైపు తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకుంటామని టీటీడీ హామీ ఇచ్చింది. ఉమ్మడి రాష్ర్టం తరహలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు.

Related Posts
ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి.నారాయణన్
ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి.నారాయణన్

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తదుపరి ఛైర్మన్ గా, అంతరిక్ష శాఖ కార్యదర్శిగా వి. నారాయణన్ నియమితులయ్యారు, మంగళవారం చేసిన అధికారిక ప్రకటన ప్రకారం. ప్రస్తుత Read more

ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు పెద్ద చర్చకు గురవుతున్నాయి, ఎందుకంటే ఈ స్థానాలు కీలకంగా మారాయి. ఇటీవల ఎన్నికల Read more

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు
commercial gas cylinder pri

commercial gas cylinder price hike న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను దేశీయ చమురు సంస్థలు పెంచాయి. 19 కేజీల సిలిండర్‌పై ఏకంగా Read more

Drone Show: ఐదు ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన విజయవాడ డ్రోన్ షో
amaravathi

ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ సహకారంతో నిర్వహించిన ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన డ్రోన్ షో అద్భుతంగా విజయవంతమైంది ఈ భారీ ఈవెంట్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *