Tirumala : టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం

Tirumala : టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం

టీటీడీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సర్వత్తరా విమర్శలు వస్తున్న నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, సమీక్ష అనంతరం శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. తిరుమలలోని పాలక మండలి కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు సమావేశం కానుంది. తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు పరిహారంపై సమావేశంలో తీర్మానం చేసే అవకాశముంది.
బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం చెక్కులు తయారు చేసే అంశంపై , ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం చెక్కులను రేపు (శనివారం) అందజేసే అంశంపై చర్చించనున్నారు. అదేవిధంగా వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన చర్చ జరుగనుంది.

Advertisements
 టీటీడీ
టీటీడీ

గత బుధవారం రాత్రి తిరుపతిలోని పద్మావతి గార్డెన్‌లో నెలకొల్పిన టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృత్యువాత పడగా 48 మంది గాయపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎస్పీ పాటు గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, సీవీఎస్‌వో శ్రీధర్‌ను అక్కడి నుంచి బదిలీ చేశారు. ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి లక్ష చొప్పున ప్రభుత్వం పరిహారంగా ప్రకటించింది.

Related Posts
జగన్‌కు పాస్‌పోర్టు పునరుద్దరణకు హైకోర్టు ఆదేశాలు
AP High Court orders to restore YS Jagan passport

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఐదేళ్ల కాలపరిమితతో పాస్‌పోర్టు జారీ చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. Read more

మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు
జనసేనకి ఈసీ మరో శుభవార్త

ప్రతి ఏడాది ఈ వేడుకలు ప్రత్యేకం జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని, ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలను Read more

Annamaya District : ఘోర రోడ్డు ప్రమాదం.. హంద్రీనీవా డిప్యూటీ కలెక్టర్‌ మృతి
Major road accident.. Handriniva Deputy Collector dies

Annamaya District : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు-రాయచోటి మధ్య రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ Read more

నారా లోకేశ్ సమక్షంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగం
నారా లోకేశ్ సమక్షంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగం

నారా లోకేశ్ సమక్షంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగం టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య Read more

×