టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు

TTD ఛైర్మన్ గా బీఆర్ నాయుడు ప్రమాణం

టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు పదవి బాధ్యతలు చేపట్టారు. రీసెంట్ గా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నూతన బోర్డు సభ్యులను ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు . టీటీడీ చైర్మన్‌ పదవిని టీవీ-5 అధినేత బీఆర్‌ నాయుడికి అప్పగించారు. టీటీడీ బోర్డు సభ్యులుగా మొత్తం 23 మందిని నియమించారు బోర్డులో నియమితులైన సభ్యులలో ముగ్గురు ఎమ్మెల్యేలు జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మడకశిర నుంచి ఎంఎస్ రాజు ఉన్నారు వీరితో పాటు టీడీపీ నాయకులు పనబాక లక్ష్మి, జాస్తి శివ (సాంబశివరావు) నన్నపనేని సదాశివరావు కోటేశ్వరరావు మల్లెల రాజశేఖర్ గౌడ్ జంగా కృష్ణమూర్తి, శాంతారాం, పి. రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, నరేశ్ కుమార్ సభ్యులుగా నియమితులయ్యారు.

Advertisements

తెలంగాణ నుంచి నర్సిరెడ్డి, బుంగునూరు మహేందర్ రెడ్డి, ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్‌ బురగపు ఆనంద్ సాయి, రంగశ్రీ, భారత్ బయోటెక్ సంస్థకు చెందిన సుచిత్ర ఎల్ల కూడా సభ్యులుగా నియమితులయ్యారు కర్ణాటక నుంచి జస్టిస్ హెచ్‌ఎల్‌ దత్, దర్శన్ ఆర్‌ఎన్, గుజరాత్ నుంచి డాక్టర్‌ అదిత్ దేశాయ్, మహారాష్ట్ర నుంచి సౌరబ్ హెచ్ బోరా, తమిళనాడు నుంచి కృష్ణమూర్తి కూడా ఈ బోర్డు సభ్యులుగా ఎంపికయ్యారు. జనసేన కోటాలో తెలంగాణ నుంచి మహేందర్ రెడ్డి కి అవకాశం దక్కింది.

Related Posts
Asaduddin Owaisi : జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడి ఘటన పై స్పందించిన అసదుద్దీన్
Asaduddin responds to Jammu and Kashmir terror attack

Asaduddin Owaisi : జమ్మూకశ్మీర్‌ లో జరిగిన ఉగ్రమూకల దాడిని ఎమ్ఐఎమ్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి అమాయకులను Read more

IPL: నేడు పంజాబ్, కోల్కతా మధ్య పోరు
PBKS, KKR Match

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో నేటి మ్యాచ్‌ పంజాబ్ కింగ్స్ (PBKS) మరియు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఉత్కంఠగా జరగనుంది. ఇప్పటివరకు ఈ రెండు Read more

CM Chandrababu : అమరావతిలో ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన చంద్రబాబు
Chandrababu performs Bhoomi Puja for construction of house in Amaravati

CM Chandrababu : రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల‌గ‌పూడి Read more

వైసీపీ వేధింపుల్లో నేను ఒక బాధితురాలిని – షర్మిల
వైసీపీ వేధింపుల్లో నేను ఒక బాధితురాలిని - షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన ట్విట్టర్ లో సామాజిక మాధ్యమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు సమాజానికి మంచిని అందించేందుకు సృష్టించబడినవే కానీ Read more

Advertisements
×