ఎలాన్ మస్క్ (Musk) రాజకీయ రంగప్రవేశానికి సంబంధించి మూడో పార్టీ ఏర్పాటు చేస్తున్న వార్తలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. మస్క్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఓ సుదీర్ఘ సోషల్ మీడియా పోస్ట్‌ను షేర్ చేశారు. గత ఐదు వారాలుగా మస్క్ చేసిన చర్యలు తనను ఆశ్చర్యపరచాయని ట్రంప్ పేర్కొన్నారు.
“డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చే విధంగా మస్క్ వ్యవహారం”
ట్రంప్ (Trump) చేసిన పోస్ట్‌లో “డెమోక్రాట్లు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా.. మస్క్ మూడో పార్టీ పెట్టతానంటూ ప్రయత్నించడం బాధాకరం” అని విమర్శించారు. తాను అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాలపై విధించిన మాండేటరీ (EV Mandate)ను రద్దు చేస్తానని చెప్పిన నేపథ్యంలో.. మస్క్ తాను పెట్టిన కంపెనీలపై ప్రభావం పడకూడదనుకుంటున్నాడని అభిప్రాయపడ్డారు.
NASA అధిపతిగా మిత్రుడిని కోరిన మస్క్
మస్క్ తనకు అనుకూలంగా ఉన్న డెమోక్రాట్ మిత్రుడికి NASA పగ్గాలు ఇవ్వాలని కోరాడని, అయితే తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్టు ట్రంప్ తెలిపారు. తన ఆశలు నెరవేరకపోవడమే ఈ రాజకీయ పార్టీ ఏర్పాటుకు కారణమని స్పష్టం చేశారు. చివరగా మస్క్ చర్యలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : ISET Results : నేడు ఐసెట్ ఫలితాలు విడుదల