పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్(Asim Munir)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) విందు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్(Bin Ladan)కు పాకిస్థాన్ ఆశ్రయం కల్పించిందన్న విషయాన్ని అమెరికా ఎన్నటికీ మరచిపోకూడదని ఆయన హితవు పలికారు.

ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేరు
ఈ సందర్భంగా శశిథరూర్ మాట్లాడుతూ, “వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడికి ప్రధాన సూత్రధారి అయిన ఒసామా బిన్ లాడెన్ ఉదంతాన్ని పాకిస్థాన్ బృందాన్ని కలిసిన కొందరు అమెరికన్ చట్టసభ సభ్యులు విస్మరించినప్పటికీ, అమెరికా ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. లాడెన్‌ను కనుగొనేంత వరకు, ఒక ఆర్మీ క్యాంపు సమీపంలో పాకిస్థాన్ అతడిని దాచిపెట్టిన వ్యవహారాన్ని అమెరికన్లు అంత త్వరగా విస్మరించరు” అని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, ఆర్థిక సహాయం అందించడం వంటి చర్యలకు పాల్పడకూడదని ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించి ఉంటారని తాను ఆశిస్తున్నట్లు థరూర్ పేర్కొన్నారు. “ఈ విందు సందర్భంలో ట్రంప్ పాకిస్థాన్‌కి గట్టిగా హెచ్చరించి, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, శిక్షణ ఇచ్చే చర్యలు ఆపాలని స్పష్టంగా చెప్పి ఉంటారని తాను ఆశిస్తున్నాను” అని థరూర్ పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వంపై అవిశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, ఇలా ఓ ఉగ్రవాద అనుబంధ దేశం అధికారికి అమెరికా గౌరవం ఇవ్వడం న్యాయమా? అనే ప్రశ్నను ప్రజల ముందుంచారు.
“కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు సహజం”
పార్టీలో కొందరి నేతలతో తాను భిన్నంగా ఉండొచ్చని అంగీకరించిన థరూర్, అంతేకదా ప్రజాస్వామ్యం శక్తి అని పేర్కొన్నారు. అలాగే, ఇటీవల ప్రధాని మోదీతో ఆపరేషన్ సిందూర్పై తాను మాట్లాడిన విషయాన్ని కూడా గుర్తు చేశారు, కానీ దానిపై వివరాలు ఇవ్వలేదు.
Read Also: Silver candle stand: క్రొయేషియా ప్రధానమంత్రికి వెండి కొవ్వొత్తి స్టాండ్‌ను ఇచ్చిన ప్రధాని మోదీ!