donald trump

అవినీతి నిరోధక చట్టాన్ని సస్పెండ్ చేసిన ట్రంప్

పాత చట్టాల దుమ్ము దులుపుతున్న ట్రంప్

Advertisements

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పాత చట్టాల్లో మార్పులు చేయడం ప్రారంభించారు. తాజాగా అమెరికన్ వ్యాపారాలను పరిరక్షించాలనే పేరుతో ఓ కీలక చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. “Foreign Corrupt Practices Act (FCPA)” అనే చట్టాన్ని సస్పెండ్ చేసి వ్యాపార విభాగాలకు ఉపశమనం కల్పించాలని కొత్త అటార్నీ జనరల్ పామ్ బొండికి ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు.

FCPA అంటే ఏంటి అంటే..

1977లో ప్రవేశపెట్టిన FCPA చట్టం ప్రకారం.. అమెరికన్ కంపెనీలు లేదా వారి ప్రతినిధులు విదేశీ ప్రభుత్వ అధికారులకు లంచం ఇస్తే, అది నేరంగా పరిగణించబడుతుంది. ఈ చట్టం అంతర్జాతీయ వ్యాపారాల్లో అవినీతిని అరికట్టే ప్రధాన చర్యగా ఇంతకాలం అమలులో ఉంది. అయితే, అమెరికా కంపెనీల పోటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని, వ్యాపారాలకు విఘాతం కలిగిస్తోందని ట్రంప్ వాదన.

FCPA అమలు వల్ల అమెరికన్ కంపెనీలు చాలా దేశాల్లో వ్యాపారం చేయడానికి ఇబ్బంది పడుతున్నాయని, కొన్ని దేశాల్లో వ్యాపారం చేసేందుకు స్థానిక అధికారులను ముడుపులు ఇచ్చే అవసరం వస్తుందని, ఈ చట్టం కారణంగా అమెరికా వ్యాపారాలు వెనుకబడుతున్నాయని ట్రంప్ చెబుతున్నారు. అందుకే ఈ చట్టాన్ని పూర్తిగా తొలగించకపోయినా, తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పై కూడా FCPA చట్టం ప్రకారం విచారణ జరుగుతోంది. విదేశీ సంస్థలకు అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన అంశాల్లో ఈ చట్టం ప్రస్తావనకు వచ్చింది. అయితే ట్రంప్ ఈ చట్టాన్ని నిలిపివేయడం వల్ల, ఇలాంటి కేసులపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది అవినీతికి తలుపులు తెరుచే ప్రమాదముందని, అమెరికా వ్యాపార ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందని అంటున్నారు.

Related Posts
TCS : భారత ఉత్తమ కంపెనీగా టీసీఎస్
TCS named India best company

TCS : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ లింక్డ్‌ఇన్‌ మంగళవారం భారత్‌లోని ఉత్తమ కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఇందులో దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ Read more

6 జిల్లాల్లో వెదురు సాగుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
veduru

తెలంగాణ రాష్ట్రంలో వెదురు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నాలుగేళ్లలో 7 లక్షల ఎకరాల్లో వెదురు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ Read more

Metro : మెట్రో రైలు ప్రయాణ వేళలు పొడిగింపు
Hyderabad Metro Rail: మెట్రో రైలుకి పెరుగుతున్న ఆర్ధిక భారం

HYD మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. రైలు సేవలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రయాణ వేళలను పొడిగించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉదయం 6 Read more

ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష
imran khan

పాకిస్థాన్ ప్రధాని ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీలను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ Read more

×