అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్'(One Big Beautiful Bill)పై సంతకం చేశారు. ఈ బిలును ఆయన జూలై 4, ఇండిపెండెన్స్ డే సందర్భంగా వైట్‌హౌస్‌లో జరిగిన వేడుకల్లో అధికారికంగా చట్టంగా మార్చారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ట్రంప్, “దేశంలో ప్రజలంతా ఇంత హర్షాతిరేకంగా ఉన్న దృశ్యం నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఈ బిలుతో అన్ని వర్గాలకు రక్షణ లభించనుంది” అని పేర్కొన్నారు.
పన్ను తగ్గింపులతో ప్రజలకు ఊరట
ఈ బిల్లో ప్రధానంగా ట్యాక్స్ కట్స్ (పన్ను తగ్గింపులు)కు పెద్దపీట వేశారు. మధ్యతరగతి ప్రజలు, చిన్న స్థాయి వ్యాపారులు దీనివల్ల స్వల్పకాలికంగా అయినా ఊపిరి పీల్చుకునే అవకాశం పొందనున్నారు. ఈ మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థలో తాత్కాలిక ఊతాన్ని కలిగించేలా రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. పన్నుల భారం తగ్గించడమే కాకుండా, పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఇది ఉపయుక్తమవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వ్యయ నియంత్రణకు దిశా నిర్దేశం
ట్యాక్స్ కట్స్‌తో పాటు ప్రభుత్వం వ్యయ నియంత్రణపై కూడా దృష్టి పెట్టింది. అనవసరమైన ఖర్చులను తగ్గిస్తూ, ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడమే లక్ష్యంగా బిల్లు రూపొందించబడింది. దీని ద్వారా సమర్థవంతమైన పరిపాలన, సమతుల్యతతో కూడిన అభివృద్ధికి దోహదం చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ (Trump ) చొరవ తీసుకుని తీసుకువచ్చిన ఈ బిలు రాబోయే అమెరికన్ రాజకీయాల్లో, ఆర్థిక రంగంలో కీలక మలుపుగా మారనుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
Read Also : Congress Party : కాంగ్రెస్ సభతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు..