Trump inauguration swearing in to be moved indoors due to cold

ఇండోర్‌లోనే ట్రంప్ ప్రమాణం

న్యూయార్క్‌ : ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం ఇండోర్‌లో జరగనుంది. వాషింగ్టన్ డీసీలో విపరీతమైన చలి ఉండటంతో క్యాపిటోల్ భవనంలో ప్రమాణం చేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో అతిథులను ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పారు. కాగా అర్కిటిక్ బ్లాస్ట్ వల్ల వాషింగ్టన్ డీసీలో 20న -12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులకు డొనాల్డ్ ట్రంప్-జేడీ వాన్స్ ఇనాగ్యురల్ కమిటీ ఆహ్వాన పత్రికలను పంపించింది. భారత్ సహా జీ20, బ్రిక్స్ ప్లస్.. వంటి అత్యున్నత గ్రూప్‌లల్లో సభ్య దేశాలకూ ఈ ఆహ్వాన పత్రికలు ఇప్పటికే అందాయి. ఇంకో రెండు రోజుల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభం కావాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. వేదికను మార్చుకున్నారు. అవుట్ డోర్ నుంచి ఇండోర్‌లోకి మారిందీ కార్యక్రమం. సాధారణంగా అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం అవుట్ డోర్‌లో ఏర్పాటవుతుంటుంది. రాజధాని వాషింగ్టన్ డీసీలోని వెస్ట్ ఫ్రంట్‌ దీనికి వేదిక అవుతుంటుంది. 2020లో కూడా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇక్కడి నుంచే ప్రమాణం చేశారు.

image
Trump inauguration swearing in to be moved indoors due to cold

వందలాది మంది పోలీసులు, భద్రత సిబ్బంది. సంప్రదాయబద్ధంగా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో వినియోగించే గుర్రాలు, ప్రమా స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి వచ్చే మద్దతుదారులు, సాధారణ ప్రజలు.. గంటల కొద్దీ చలిలో గడపాల్సిన పరిస్థితులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో వేదికను కేపిటల్ వన్ ఎరినా రొటుండాలోకి మార్చుకున్నానని ట్రంప్ పేర్కొన్నారు. అధ్యక్షుడి ప్రమాణ స్వీకార వేదిక మారడం ఆ దేశ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. 1985లో అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఇనాగ్యురల్ సెరిమని కూడా కేపిటల్ రొటుండాలో చోటు చేసుకుంది. అప్పట్లో కూడా చలి తీవ్రతే కారణం.

Related Posts
భారత క్రికెట్ సౌరవ్ గంగూలీ బయోపిక్
భారత క్రికెట్ సౌరవ్ గంగూలీ బయోపిక్.

భారత క్రికెట్ జట్టులో సౌరవ్ గంగూలీ ఒక అద్భుతమైన ఆటగాడిగా, అలాగే కెప్టెన్‌గా కూడా తన కత్తిరాలు చూపించాడు. గంగూలీ కెప్టెన్సీలోనే భారత జట్టు విదేశీ గడ్డపై Read more

హామీలెందుకు నెరవేర్చలేకపోతున్నారు – కూనంనేని
kunamneni sambasiva rao

CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నికల హామీల అమలులో విఫలమవుతున్న కారణాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ముసీ నది పునరుద్ధరణపై Read more

మరికాసేపట్లో ఢిల్లీకి సీఎం చంద్రబాబు
CM Chandrababu held meeting with TDP Representatives

ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం 1.00 గంటకు ఢిల్లీకి వెళ్లనున్నారు. అందుకోసం వెలగపూడిలోని సచివాలయం ఎదురుగా ఉన్న హెలి ప్యాడ్ నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి Read more

కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌ని ఉపయోగించిన నర్సు
కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌ని ఉపయోగించిన నర్సు

కర్ణాటక రాష్ట్రంలోని హవేరి జిల్లా హనగల్ తాలూకాలో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న నర్సు, గాయానికి కుట్లు వేయాల్సిన Read more