నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు అత్యంత సుందర ప్రదేశం.2015లో సంభవించిన భూకంపంలో ఈనగరం సర్వనాశనమై కోలుకుంటోంది. ఇక్కడ జరిగిన తవ్వకాల ప్రకారం గతంలో చక్కటి నాగరికత వెలిసినట్లు ఆధారాలు లభించాయి.
దండోచైత్య సొరంగంలో బ్రహ్మిలిపిలో లిఖింపబడిన వాక్యాలున్న ఒక ఇటుక లభ్యమైంది. పురాతత్వం శాస్త్రవేత్తలు ఇది 2000 సంవత్సరాల పూర్వ కాలానికి చెందినదని అంచనా వేసారు. ఈ ప్రాంతం కనీసం 130 ముఖ్యమైన స్మారక చిహ్నాలను కలిగి ఉంది. హిందువులు(Hindus), బౌద్ధులకు అనేక తీర్థయాత్ర ప్రదేశాలు ఉన్నాయి. లోయలో ఏడు ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. చారిత్రాత్మకంగా, లోయ, పరిసర ప్రాంతాలను (areas) కలిపి నేపాల్ మండల సమాఖ్యగా ఏర్పడింది. ఖాట్మండు, లలిత్పూర్(పటాన్) అనే రెండు ఇతర రాజధానులు స్థాపించబడినప్పుడు 15వ శతాబ్దం వరకు, భక్తపూర్ దాని రాజధానిగా ఉంది. 1960 వరకు ఖాట్మండు లోయను నేపాలా లోయ, నేపా వ్యాలీ అని పిలిచేవారు. 1961లో ఖాట్మండు లోయను జిల్లాగా చేసారు. అప్పటి నుంచి దీనిని ఖాట్మండు వ్యాలీగా పిలుస్తున్నారు. నేపా వ్యాలీ అనే పదాన్ని ఇప్పటికీ నెవార్ ప్రజలతో పాటు స్థానిక ప్రభుత్వం ఉపయోగిస్తుంది. వృద్ధులు ఇప్పటికీ ఈ లోయను నేపాల్ అనే సూచిస్తారు. స్వనిగ అనే నేపాల్ భాష పదం మూడు నగరాలు అని సూచిస్తుంది. అవి యెన్(ఖాట్మండు), యాల(లలిత్పూర్),కవాప (భక్తపూర్) సూచించడానికి ఉపయోగిస్తారు. ఖాట్మండు, లలిత్పూర్, భక్తపూర్ ఈ మూడు పట్టణాలు చారిత్రకమైనవి. నేపాల్లోని ఖాట్మండులోయ అత్యధిక
జనాభా కలిగి అభివృద్ధి చెందిన ప్రదేశం.

ఖాట్మండు లోయ 24 కి.మీ. పొడవు, 19 కి. మీ. వెడల్పును కలిగివుండి చుట్టూ ఆకుపచ్చని వృక్షాలు,గంభీరమైన సుందర పర్వతాలు నయనానందం చేయడంతో రంగుల యాత్రా కథనం రాజధానిగావిరజిల్లుతోంది. అధిక సంఖ్యలో కొన్ని ప్రధాన కార్యాలయాలు ఈ లోయలో ఉన్నాయి. ఇది నేపాల్ దేశం ఆర్థిక కేంద్రంగా మారింది. నేపాల్లో అత్యధిక సంఖ్యలో జాతరలు (వీధి ఉత్సవాలు) జరుగుతాయి. ఇక్కడి ప్రత్యేకమైన వాస్తుశిల్పం, గొప్ప సంస్కృతి, పర్యాటకుల సందర్శన వలన ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ చరిత్రకారులు ఈ లోయను ‘నేపాల్ ప్రాపర్’ అని పిలుస్తారు. పహారీ పేరు ఖాట్మండు దర్బార్ స్క్వేర్ లోని ఒక నిర్మాణం నుండి వచ్చింది.
ఖాట్మండు నగరానికి ఆ పేరు కాష్టమండపం ఆలయం ద్వారా వచ్చింది. సంస్కృతంలో కాష్ఠ అనగా కొయ్య; మండప్ అనగా కప్పబడిన ప్రదేశం అని అర్థం. స్థానిక భాషలో దీనిని మారు సతాల్ అని కూడా పిలుస్తారు. దీని సంస్కృత పేరు కాష్ఠ మండప ‘చెక్క ఆశ్రయం’ అని పిలుస్తారు. విశిష్టమైన సత్తాల్ఆలయాన్ని 1596లో రాజు లక్ష్మీ నరసింహ మల్లా నిర్మించాడు. ఎక్కడా ఇనుప మేకులు ఉపయోగించకుండా ఆలయ నిర్మాణమంతా పూర్తిగా చెక్కతోనే నిర్మించడం విశేషం.రెండతస్తుల ఈ పగోడాకు ఉపయోగించిన కలప ఒకే చెట్టు నుండి లభించిందని ఇక్కడి చరిత్ర వల్ల తెలుస్తోంది. ఖాట్మండులోని చాలా చోట్ల బంగారు దేవాలయాలు, బుద్ధ విగ్రహాలు అత్యంత కళాత్మకంగా దర్శనమిస్తాయి.
ఖాట్మండులో చూడదగిన ప్రదేశాలు:
పశుపతినాథ్ ఆలయం
ఖాట్మండు తూర్పు అంచున పశుపతినాథ్ ఆలయం భాగమతి నది ఒడ్డున విస్తరించి ఉంది. భారతదేశం అంతటా ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలకు అధిపతిగా భావించే జ్యోతిర్లింగాన్ని కలిగి ఉన్న పశుపతినాథ్ఆలయాన్ని తిలకించడానికి భారతదేశం నుండి కూడా శివభక్తులు వెళుతుంటారు. చుట్టుపక్కల ప్రాంతంలో దేవాలయాలు,ఆశ్రమాలు ఉన్నాయి. యునెస్కో 1979లో
పశుపతినాథ్ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. నేపాల్ దేశ రాజధాని
ఖాట్మండు నగరం ఈశాన్య దిక్కు పొలిమేర్లలో భాగమతి నది ఒడ్డున ఉంది. పశుపతి (శివుడు)
ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు. భారతదేశం, నేపాల్ నుండివచ్చిన భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.
మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం కావడంతో వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు. ఈ దేవాలయంలోకి హిందువులు కానివారిని అనుమతించరు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూలవిరాట్టుని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉంది. శంకరాచార్యులు
ప్రారంభించిన ఆలయ సంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. శంకరాచార్యులు ఇక్కడ జంతుబలిని నిషేధించారు. దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం.. నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశం సంతాప సముద్రంలో మునిగివుంది. ఆ సమయంలో నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్య కైంకర్యాలు చేసే అవకాశం ఉండదు. పశుపతినాథ్క
నిత్య కైంకర్యాలు నిరంతరంగా కొనసాగాలనే కారణంచేత భారతదేశ అర్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహించే సంప్రదాయం మొదలైంది.

బౌద్ధనాథ్ స్థూపం
ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులు ఇక్కడకు వస్తుంటారు. వారు ఆచార’ పద్ధతిలో ‘రా’ అని పిలువబడే పెద్ద గోపురం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. 1979 నుండి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా దీనిని గుర్తించింది. బౌద్ధనాథ్ స్థూపం ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే బౌద్ధ
ప్రదేశాలలో ఒకటి. కశ్యప బుద్ధుని చితాభస్మం ఈ స్థూపంలో పూడ్చిపెట్టబడిందని నమ్ముతారు.
నమో బుద్ధ స్థూపం
నమో బుద్ధ ఖాట్మండులోని అత్యంత ప్రసిద్ధ బౌద్ధ మత స్మారక కట్టడాలలోఒకటి. బౌద్ధనాథ్ స్థూపం నుండ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యాత్రా స్థలం సందర్శనకుఆహ్లాదకరమైన ప్రదేశం. పచ్చ, మణి, రత్నాలతో కప్పబడిన పర్వతాలు,ఆటవిక సౌందర్యం, ఇక్కడి ప్రకృతిదృశ్యం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది.
డ్రీమ్స్ గార్డెన్
ఖాట్మండులోని డ్రీమ్స్ గార్డెన్ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. దీన్ని స్వప్నబైగిచాను గార్డెన్ ఆఫ్ డ్రీమ్స్అని కూడా పిలుస్తారు. రోజువారీ జీవితంలోని ఒత్తిళ్ల నుండి ప్రశాంతత పొందేందుకు అనునిత్యం పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. 1920లో నిర్మించిన ఈ తోటను చాలా అభివృద్ధి
చేశారు. ఇక్కడ సుందర సరస్సులు, ఫౌంటెన్లు ఉన్నాయి. ఈ ప్రదేశం పిక్నిక్ స్పాట్గా ప్రసిద్ధి చెందింది.

సిద్ధార్థ ఆర్ట్ గ్యాలరీ
ఇక్కడ నేపాలీ కళాఖండాలు తిలకించవచ్చు. నేపాలీ కలల చరిత్రను తెలుసుకోవాలంటే ఈ
సంగ్రహాలయాన్ని తప్పక చూడాల్సిందే. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కళాఖండాల గ్యాలరీ
పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది.
థమెల్
ఖాట్మండు నగరంలో థమెల్ అనేది అత్యంత రద్దీగా ఉండే ప్రసిద్ధ వాణిజ్య కేంద్రాలలో, ఒకటి. ఇక్కడ చారిత్రక కట్టడాలు, అద్భుతమైన దేవాలయాలు చూడవచ్చు.పర్యాటకులకు కావలసిన అన్ని రకాల వస్తువులు వీధి అంగళ్లలో లభిస్తాయి. మంచి ఆహారం, దుస్తులు, పర్యాటకులు ఇష్టపడే అనేక వస్తువులు కొనుగోలు చేయవచ్చు.

జగన్నాథ దేవాలయం
ఖాట్మండులోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి జగన్నా దేవాలయం. దాని నిర్మాణం,మతపరమైన ప్రాముఖ్యతకు అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడి సున్నితమైన శృంగార శిల్పాలు పెద్ద సంఖ్యలో
పర్యాటకులను ఆకర్షిస్తాయి. నగరంలోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఇది 16వ శతాబ్దం ప్రారంభంలో మల్లా రాజవంశం రాజు మహేంద్ర పాలనలో దీన్ని నిర్మించారు. అంతర్నిర్మిత
సాంప్రదాయ పగోడా శైలి నిర్మాణం ఎక్కువగా చెక్క ఇటుకలతో నిర్మించారు.
తౌదాహ సరస్సు
ఖాట్మండు శివార్లలో ప్రసిద్ధి చెందిన మంచినీటి సరస్సు తౌదాహ. ఈ సరస్సు చుట్టూ దట్టమైన అడవులు, కొండలు ఉన్నాయి. సరస్సులో అనేక రకాల చేపలు ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతంలో వలస పక్షులు వస్తుంటాయి. పక్షుల వీక్షణకు ఈ ప్రాంతం గొప్ప కేంద్రంగా విరాజిల్లుతుంది.
దర్బార్ స్క్వేర్
ఖాట్మండు సంస్కృతి, చరిత్రను తెలుసుకోవాలంటే దర్బార్ స్క్వేర్ని సందర్శించవలసిందే. ఖాట్మండు దర్బార్ స్క్వేర్కు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునోస్కో గుర్తింపు లభించింది.
హస్తకళాకారుల ప్రదర్శనలకు ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఖాట్మండులోని ఒకప్పటి రాజభవనం ఎదురుగా ఉంది. ఇక్కడ నెలకొని ఉన్న కుమారి చోక్ నేపాల్ అత్యంత ఆసక్తికరమైన
ఆకర్షణలలో ఒకటి.

కైసర్ గ్రంథాలయం
ఖాట్మండులోని కైసర్ మహల్లోని కైసర్ గ్రంథాలయంలో 45,000 పుస్తకాలు ఉన్నాయి. 1969లో
స్థాపించిన ఈ లైబ్రరీలో చరిత్ర, చట్టం, కళ,మతం, తత్వశాస్త్రం వంటి విషయాలపై అనేక రకాల
పుస్తకాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ గ్రంథాలయం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా విరాజిల్లింది. 2015లో
సంభవించిన భూకంపం కారణంగా తీవ్రంగా దెబ్బతింది.
లాంగ్జాంగ్ నేషనల్ పార్క్
ఇది నేపాల్లోని నాల్గవ పెద్ద జాతీయ ఉద్యానవనం. ఖాట్మండుకు ఉత్తరాన 32కిలోమీటర్ల దూరంలో,
టిబెట్ కోమోలాంగ్మా నేషనల్ నేచర్ ప్రిజర్వ్ సరిహద్దులో ఉంది. లాంగ్జాంగ్ నేషనల్ పార్క్ఉద్యానవనంలో గోసాయికుండ పేరుతో ఒక సరస్సు ఉంది. దీన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పచ్చని పొలాలు, అందాల తోటలు, అనేకరకాల వన్యప్రాణులు, 250 కంటే
ఎక్కువ పక్షులను ఇక్కడ తిలకించవచ్చు.
ఫుల్ చౌకీ
ఫుల్ చౌకీ పర్వత శ్రేణి ఖాట్మండులోయ చుట్టూ ఉంది. సాహిత్యపరమైన అర్థంలో దీని పేరు ‘పువ్వులు’ అని అర్థం. ఇక్కడ అందమైన పువ్వులు పెరుగుతాయి.ఇవి చాలా ప్రకాశవంతమైన
రంగుల్లో ఉంటాయి.ఈ ప్రాంతం సందర్శించడానికి నాలుగు గంటల సమయం పడుతుంది.

ఆకాశ భైరవ దేవాలయం
ఆకాశ భైరవ్ అంటే ‘ఆకాశానికి ప్రభువు’ అని అర్థం. ఖాట్మండు దర్బార్ స్క్వేర్ నుండి కేవలం ఐదు నిమిషాల నడక మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయాన్ని ఆకాశ భైరవుడికి అంకితం చేశారు. నేపాల్ ప్రజలు ఎంతో విశ్వాసంతో ఈ దేవుని కొలుస్తారు. ఏడాదికి ఒకసారి ‘ఇంద్ర జాత్ర’ పేరుతో ఇక్కడ ఎనిమిది రోజుల పాటు గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి నేపాల్ నలుమూలల నుండి భక్తజనులు ఇక్కడకు వస్తుంటారు.
Read also: hindi.vaartha.com
Read also: