పాకిస్తాన్ వేదికగా ట్రై-నేషన్స్ సిరీస్ జరుగుతున్ననేపథ్యం లో న్యూజిలాండ్ పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో ఫైనల్లో ఘన విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో న్యూజిలాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. బౌలర్ విల్ ఓ’రూర్కే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించగా, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ అర్ధ సెంచరీలతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు.మంగళవారం జరిగిన ఈ హోరాహోరీ పోరులో పాకిస్తాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ, మహ్మద్ రిజ్వాన్ (46), సల్మాన్ ఆఘా (45), తయ్యబ్ తాహిర్ (38) పాక్ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించేందుకు ప్రయత్నించారు. కానీ న్యూజిలాండ్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ భారీ స్కోరు చేయలేకపోయింది. విల్ ఓ’రూర్కే (4/43), మిచెల్ సాంట్నర్ (2/20), మైఖేల్ బ్రేస్‌వెల్ (2/38) కీలక వికెట్లు తీయడంతో పాక్ జట్టు కష్టాల్లో పడింది.

243 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఛేజింగ్ ఆరంభంలో కాస్త కష్టాల్లో పడింది. ఓపెనర్ విల్ యంగ్ తక్కువ స్కోరుకే ఔటవ్వగా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (34), డెవాన్ కాన్వే (48) ఇద్దరూ రెండో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం అందించి జట్టును గాడిలో పెట్టారు. అనంతరం డారిల్ మిచెల్ (57), టామ్ లాథమ్ (56) శతక భాగస్వామ్యంతో జట్టును విజయ దిశగా నడిపించారు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (20 నాటౌట్) విజయం ఖరారు చేశారు. న్యూజిలాండ్ జట్టు 45.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసి టైటిల్‌ను సాధించింది.మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ, “280కి పైగా స్కోరు చేయాలని అనుకున్నాం. కానీ న్యూజిలాండ్ బౌలర్లు కట్టడి చేశారు. నా వికెట్ కీలకమైన సమయంలో కోల్పోవడం నిర్ణాయకంగా మారింది” అని పేర్కొన్నారు.
కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ
“ఇది మాకు మంచి విజయమే. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇది మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మేము విభిన్న పరిస్థితుల్లో ఎలా రాణించగలమో ఈ మ్యాచ్‌లో ప్రదర్శించాం. కానీ అసలైన పరీక్ష బుధవారం ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది” అని చెప్పారు.విజయంతో న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లలో ఉత్సాహం నెలకొంది. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే ఫార్మ్ కొనసాగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆటగాళ్ల వ్యక్తిగత ఫార్మ్, బౌలింగ్ లైనప్ క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు భవిష్యత్ ప్రదర్శనపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.