Traffic restrictions in the city tomorrow.. diversions at many places

నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు.. ప‌లు చోట్ల దారి మళ్లింపు

హైదరాబాద్‌: మార్చి 8వ తేదీన అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ట్రాఫిక్ జాయింట్ క‌మిష‌న‌ర్ జోయ‌ల్ డేవిస్ వెల్ల‌డించారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం జ‌ర‌గ‌నుంది. ఈ నేపథ్యంలో పరేడ్‌ గ్రౌండ్‌ వైపు ఉన్న దారుల్లో ఆంక్షలు విధిస్తున్నామని, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌న్నారు.

Advertisements
నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

ట్రాఫిక్ ఆంక్ష‌లు ఇలా..

టివోలి క్రాస్‌ రోడ్స్‌ నుంచి ప్లాజా క్రాస్‌ రోడ్స్‌ వరకు రోడ్డు మూసివేయ‌నున్నారు. ఇక పంజాగుట్ట – గ్రీన్‌ల్యాండ్స్ – బేగంపేట – సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్ మార్గంలో వెళ్లాల‌నుకునే ప్ర‌యాణికులు ప్ర‌త్యామ్నాయ మార్గాలు చూసుకోవాల‌న్నారు.

ఆలుగడ్డ బావి, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సంగీత్‌ క్రాస్‌ రోడ్‌ వైపు, క్లాక్‌ టవర్‌, ప్యాట్నీ, పారడైజ్‌ మీదుగా మళ్లిస్తామని తెలిపారు. తుకారాంగేట్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయింట్‌ జాన్స్‌ రోటరీ వైపు.. సంగీత్‌, క్లాక్‌ టవర్‌, ప్యాట్నీ, పారడైజ్‌ మీదుగా మళ్లిస్తామన్నారు.

సంగీత్‌ క్రాస్‌ రోడ్స్‌ నుంచి బేగంపేట్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను వైఎంసీఏ నుంచి క్లాక్‌ టవర్ వైపు ప్యాట్నీ, పారడైజ్‌, సిటిఓ, రసూల్‌పుర నుంచి బేగంపేట వైపున‌కు మళ్లించ‌నున్నారు.

బేగంపేట నుంచి సంగీత్‌ క్రాస్‌ రోడ్స్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను బలామ్‌రాయి, బ్రూక్‌బాండ్‌, టివోలి, స్వీకార్ ఉప్‌కార్‌, వైఎంసిఎ, సెయింట్ జాన్స్‌రోటరీ నుంచి సంగీత్‌వైపు మళ్లిస్తారు. బోయిన్‌పల్లి, తాడ్‌బంద్‌ నుంచి టివోలి వైపున‌కు బ్రూక్‌ బాండ్‌ మీదుగా సిటిఓ, రాణిగంజ్‌, టాంక్‌బండ్ మీదుగా మళ్లిస్తారు.

కార్ఖానా, జేబీఎస్‌ నుంచి ఎస్‌బిహెచ్‌ ప్యాట్నీ వైపు వెళ్లే వాహనాలను స్వీకార్‌ ఉప్‌కార్‌ వద్ద వైఎంసిఏ, క్లాక్‌టవర్‌, ప్యాట్నీ మీదుగా టివోలి వైపు మళ్లిస్తారు. ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలను స్వీకార్‌ఉప్‌కార్‌, ఎస్‌బిహెచ్‌ వైపుకు రానివ్వ‌కుండా, క్లాక్‌టవర్‌, వైఎంసిఏ, సిటిఓ వైపు మళ్లిస్తారని తెలిపారు.

Related Posts
కోకాకోలా ఫ్యాక్టరీని ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి
CM Revanth Reddy inaugurated the Coca Cola factory

•ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణా ప్రభుత్వ సమాచార ఐటి , ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల Read more

Japan: పిల్లల్ని కనడం కోసం 36 గంటల పాటు సెలవు ప్రకటించిన జపాన్
జపాన్ 36 గంటల సెలవు

జపాన్‌లో జననాల రేటు తగ్గిపోతుండటంతో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జంటలు శృంగారంలో పాల్గొనడాన్ని ప్రోత్సహించేందుకు, వారానికి 36 గంటల సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ నిర్ణయం, Read more

ట్రంప్ వ్యాఖ్యలు నిజమే : వ్లాదిమిర్ పుతిన్
Trump comments are true: Vladimir Putin

మాస్కో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించేందుకు తాను సిద్ధంగా Read more

Andhra Pradesh: కొనసాగుతున్న ఏపీ కేబినెట్‌ సమావేశాలు పలు కీలక అంశాలపై చర్చ
కొనసాగుతున్న ఏపీ కేబినెట్‌ సమావేశాలు పలు కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ముఖ్యంగా అమరావతి అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ ప్రభుత్వంతో భాగస్వామ్యం, అమరావతి Read more

×