చిన్నపిల్లలు వాహనాలను నడపడం, ముగ్గురు నలుగులు యువతీయువలు హెల్మెంట్
లేకుండా డ్రైవ్ చేస్తుంటారు. మరికొందరైతే త్రిల్ కోసం ర్యాష్ డ్రైవింగ్ (Rash driving) చేస్తూ ప్రాణాలను పొగోట్టుకుంటున్నారు. ఇంకా కొందరైతే మొత్తం కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉంటే అందరూ ద్విచక్రవాహనాల్లోనే ప్రయాణిస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా,
ఎంత చెప్పినా వీరి ప్రవర్తన మారదు. అయితే తాజాగా కేంద్రప్రభుత్వం వాహనదారులకు
ఝలక్ ఇచ్చింది.

కొత్త ప్రతిపాదనలు
ద్విచక్ర వాహనదారులు చిన్న పిల్లలతో కలిసి వెళ్తూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే
హనదారులకు రెట్టింపు జరిమానా (Traffic fine) విధించాలని రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది.
వాహనదారుల భద్రతను, జవాబుదారీ తనాన్ని పెంపొందించేందుకు ఈ ప్రతిపాదన
చేసింది. అంతేకాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటింపు లేదా ఉల్లంఘన ఆధారంగా
డ్రైవర్లకు ‘మెరిట్ అండ్ డీమెరిట్ (Merit and Demerit) పాయింట్ విధానాన్ని కూడా ప్రతిపాదించింది. నగరాల్లో విపరీతంగా వాహనాల సంఖ్య పెరగడంతోపాటు ఇతర వాహనాలకు ఆటంకంగా వేగంగా ప్రయాణించడం, కెపాసిటీకి మించి ప్రయాణించడం వలన రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నది. ప్రత్యేకంగా చిన్న పిల్లలతో వెళ్లే ద్విచక్రవాహనాలు, ఆటోల వల్ల ట్రాఫిక్
ఉల్లంఘనలకు పాల్పడుతూ, ప్రమాదాలకు కారణంగా నిలుస్తున్నాయి. వీటిని నివారించే
ఉద్దేశంతో రోడ్డు రవాణాశాఖ కొత్త విధానాలను ప్రతిపాదించింది .
చిన్నపిల్లలు వాహనంలో ఉంటే రెట్టింపు జరిమానా ఎందుకు విధిస్తున్నారు?
పిల్లల భద్రత అత్యంత ముఖ్యమైన అంశం. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వలన ప్రమాదాలు జరిగితే చిన్నపిల్లలు అత్యధికంగా ప్రభావితమవుతారు. అందువల్లే ట్రాఫిక్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది – ఇలా చేస్తే డ్రైవర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని ఉద్దేశం.
చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏ నిబంధనలు ముఖ్యంగా పాటించాలి?
- కారులో సీటుబెల్ట్ వాడాలి
- ద్విచక్రవాహనంపై చిన్నపిల్లలకు హెల్మెట్ ఉండాలి
- స్పీడ్ లిమిట్ కంటే వేగంగా నడపకూడదు
- ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘించకూడదు
- డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడకూడదు
Read hindi news: hindi.vaartha.com
Read also: Black mass: బ్లాక్ మాస్ ఎగుమతులపై భారత్ ఆంక్షలు.. చైనాకు భారీషాక్