తెలంగాణలో మరో కీలక పెట్టుబడి ప్రాజెక్ట్ జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థ తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ టీటీడీఐ (ట్రాన్స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా), రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు, తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.562 కోట్ల పెట్టుబడితో ముందుకెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. తోషిబా ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ షిరోషి కనెటా, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ హస్తాక్షరాలు చేశారు.హైదరాబాద్‌కు సమీపంలోని రుద్రారం వద్ద, టీటీడీఐకి ఇప్పటికే రెండు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మూడో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఈ పెట్టుబడి తీసుకొస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో ముఖ్యంగా సర్జ్ అరెస్టర్లు తయారీ జరగనుంది.

ఇవి విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలకమైన పరికరాలు.కొత్త ప్లాంట్‌తో పాటు, ఇప్పటికే ఉన్న ఫ్యాక్టరీలలోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గియర్ తయారీ సామర్థ్యాన్ని మరింతగా విస్తరించనున్నారు. ఈ పరికరాలు విద్యుత్ పంపిణీలో నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా, దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా ఉంటాయి.ఈ కొత్త పెట్టుబడి రాష్ట్రంలో ఉపాధికి గనికిలా మారనుంది. అనేక మంది ఇంజినీరింగ్, టెక్నికల్ మరియు వృత్తి నిపుణులకు కొత్త అవకాశాలు దక్కనున్నాయి. ప్రత్యేకించి రుద్రారం ప్రాంత ప్రజలకు ఇది వెలకట్టలేని అవకాశంగా మారనుంది.ఈ ఒప్పందం, తెలంగాణను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దే రేవంత్ రెడ్డి ప్రభుత్వ దిశలో మరో ముందడుగు. రాష్ట్రానికి వస్తున్న విదేశీ పెట్టుబడుల సంఖ్య దాదాపు ప్రతి నెలా పెరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కూడా తెలంగాణలో స్థిరమైన పారిశ్రామిక వృద్ధికి బలమైన బాట వేసింది.విద్యుత్ రంగం ఆధునిక సాంకేతికతతో ముందుకెళ్లే ఈ యుగంలో, తోషిబా తీసుకొస్తున్న పెట్టుబడి రాష్ట్రానికి గణనీయమైన మైలురాయిగా నిలవనుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు మరిన్ని కంపెనీలను ఆకర్షించేలా చేస్తున్నాయి.ఈ ఒప్పందం ద్వారా ఒకవైపు పరిశ్రమల పెరుగుదలకు బలమైన బీజం పడగా, మరోవైపు ఉపాధి అవకాశాలు మరింతగా విస్తరించనున్నాయి. ఇది కచ్చితంగా ‘ఇన్నోవేషన్‌తో కూడిన అభివృద్ధి’కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
Read Also : Revanth Reddy : టోక్యో నుంచి చాలా నేర్చుకున్నా: రేవంత్ రెడ్డి