ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం, ప్రతి సంవత్సరం మార్చి 3న నిర్వహించ బడుతోంది. అంతరించి పోతున్న అడవి జాతుల సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు. 2013, మార్చి 3 నుండి 14 వరకు బ్యాంకాక్ లో జరిగిన జనరల్ అసెంబ్లీ 16వ సమావేశంలో ప్రపంచ అడవి జంతు జాలం, వృక్షజాలం గురించి వేడుకలు జరుపుకునేందుకు, అవగాహన పెంచడానికి మార్చి 3ను ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా పేరొ్కనడం జరిగింది. అదే సంవత్సరం డిసెంబరు 20న జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్అసెంబ్లీ దాని 68వ సెషన్ తీర్మానంలో, మార్చి 3న ప్రపంచ వన్యపాణుల దినోత్సవాన్ని ప్రకటించింది. వన్యప్రాణుల అంతర్గత విలువను, పర్యావరణ, జన్యు, సామాజిక, ఆర్థిక, శాస్త్రీయ, విద్యా, సాంస్కృతిక, వినోద అభివృద్ధికి, మానవ శ్రేయస్సు కోసం వివిధ కార్యక్రమాలు చేయాలని తీర్మానించింది. వాస్త వానికి మనిషికంటే ముందే జంతువులు భూమి మీద జీవిం చాయని సైన్స్చె బుతోంది. అయితే భూమి ఆవిర్భవించిన తరువాత పుట్టిన చాలా జంతు జాతులు ఇప్పుడు లేవు. ఈ ఆధునిక యుగంలోనూ మనకు తెలిసిన ఎన్నో జంతు లు కనుమరుగైపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో వాటి సంరక్షణ ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ప్రతీఏటా అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుతున్నాయి. వన్య ప్రాణుల సంరక్షణ కోసం మన ప్రభుత్వాలు ఏటా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. అయితే స్మగ్లర్లు, వేటగాళ్లు, వన్యప్రాణులు, అరణ్యాల పాలిట శాపంలా తయారయ్యారు. వీళ్ల దెబ్బకు కీకరారణ్యాలు సైతం మైదానాలుగా మారుతున్న పరిస్థితి. పరిశ్రమల స్థాపన పేరిట పెద్ద ఎత్తున అటవీ భూముల్లో పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహిస్తుండటం కూడా వన్య ప్రాణుల మనుగడుకు ముప్పుగా మారింది. దీంతో గూడు చెదిరిన వన్యప్రాణుల జనారణ్యంలోకి వస్తున్న పరిస్థితి.
Read Also : Jallikattu accident : జల్లికట్టులో విషాదం, ముగ్గురు మృతి, 76 మందికి గాయాలు

దేశంలోని జంతు సంపదను పరిరక్షించడానికి మొట్టమొదటి సారిగా 1898లో ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం మొదటి పక్షుల అభయారణ్యాన్ని తమిళనాడులోని వేదాంతం గల్లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1935లో మొదటి వన్యప్రాణి జాతీయ పార్కు ‘హేలీ’ని ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేశారు. ఇదే పార్కును ఇప్పుడు జిమ్ కార్బెట్ పార్కు అని పిలుస్తు న్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం జాతీయ పార్కుల సంఖ్య 102. 1976లో జరిగిన రాజ్యాంగ సవరణలోని ఆర్టికల్ 51(ఎ) ప్రకారం వన్యప్రాణి సంరక్షణ పౌరుల ప్రాథ మిక విధి. ఆదేశిక సూత్రాల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు విధిగా వన్యప్రాణులను సంరక్షించాలని పేర్కొన్నారు. భారత దేశంలో వన్యప్రాణి సంరక్షణ (Wildlife conservation) కోసం 1972లో చట్టం ఆనాటి ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం వన్య ప్రాణుల వేట నిషేధం. ఈచట్టం అమలులోకివచ్చాక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 23 టైగర్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో 441వన్య ప్రాణి సంరక్షణ (Wildlife conservation) కేంద్రాలుండగా వీటిల్లో 28 టైగర్ జోన్స్ ఉన్నాయి. అంతర్జాతీయంగా పులి చర్మానికి, గోళ్లకు, ఎముకలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో వేటగాళ్ల చేతిలో చిరుతలు బలైపోతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశవ్యాప్తంగా ఉన్న అడవుల్లో దాదాపు నలభై వేలకు పైగా ఉన్న పులులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ 1972 నాటికే ఆ సంఖ్య మూడు వేలకు పడిపోయిందంటే అప్పటి ప్రభుత్వాలు ఎంతటి నిర్లక్ష్య వైఖరి అవలంభించాయో స్పష్టంగా అర్థమవుతోంది.సాధారణంగా పులుల జనాభాను లెక్కించేందుకు ఇంతకు ముందు పాదముద్రలను గుర్తించడం ఒక్కటే మార్గం. అవి సంచరించే ప్రాంతాల్లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేసి, వాటి పాదముద్రలను సేకరించేవారు. అయితే ఇది చాలా కష్టంతో కూడు కున్నపని. కచ్చితమైన లెక్కకు ఆస్కారం కూడా తక్కువే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) పులుల మలం ద్వారా వాటిని లెక్కించే పద్ధతిని ఆవిష్క రించింది. 20వ శతా బ్దంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్ష పైచిలుకు పులులుండేవి అని అంచనా. 2014 లెక్కల ప్రకారం ప్రపంచంలో 3891 పులులు ఉండగా వాటిలో 2226 మన దేశంలోనే ఉన్నాయి. భారత్లో 2011 లెక్కల ప్రకారం 1706, 2014 ప్రకారం 2226 ఉండగా 2018 పులుల గణన ప్రకారం మన దేశంలో 2967పులులున్నాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం పులుల్లో 70శాతం పైగా మనదేశంలోనే ఉన్నాయి. గడిచిన కొన్నేళ్లలో ఒక్క మధ్య ప్రదేశ్లోనే 19పులులు మృత్యువాత పడ్డాయి. మహారాష్ట్రలో 9, ఉత్తరాఖండ్లో 9 మృత్యువాత పడ్డాయి. 2016లో దేశవ్యాప్తంగా 74 పులులు మరణించినట్టు లెక్కలు చెబుతు న్నాయి. 2006లో పులులను స్మగ్లర్ల బారి నుండి కాపాడ టానికి టైగర్ టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేశారు. విచక్షణా రహితంగా అడవులు నరుకుతూ వాటి తావులను,మంచినీటి వనరులను ధ్వంసం చేస్తున్నాం. అందుకే అడవి జంతువు లు గ్రామాలలోకి, పట్టణాల్లోకి వస్తున్నాయి. ఆహారం కోసం మనుషులపై దాడులు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితినిమార్చ డంకూడా ఈజంతు దినోత్సవం లక్ష్యాల్లో ఒకటి. జంతువులకు సహజసిద్ధమైన ఆవాసాలను కల్పించడం, జంతులను రక్షించడం, వాటి సంక్షేమాన్నికాపాడటం ఇవే ప్రధానం.
-రామ కిష్టయ్య సంగన భట్ల
Read hindi news : hindi.vaartha.com
Epaper :epaper.vaartha.com
Read Also :