हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

TTD: అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

Rajitha
TTD: అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ఒంటిమిట్టలో నిర్వహించే శ్రీరామనవమి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్య నిర్వహణ అధికారి వి.వీరబ్రహ్మం వెల్లడించారు. జిల్లా అధికార యంత్రాంగం, టీటీడీ సమన్వయంతో ఏర్పాట్లు చేసి సమిష్టి కృషితో విజయవంతం చేస్తామని వెల్లడించారు. గురువారం వారు కడప జిల్లాలోని ఒంటి మిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరగనున్న శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామనవమి, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్ అధికారులకు సూచించారు. ఒంటిమిట్ట టిటిడి అతిథి గృహంలో టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తదితర అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

Read also: TTD: కాణిపాకం ఆలయానికి కొత్త శోభ.. 10 ఎకరాల్లో గోశాల!

TTD

Sri Rama Brahmotsavams celebrated in grandeur at Ontimitta

ఏప్రిల్ 1న సీతారాముల కళ్యాణోత్సవం

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 26న అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమై, మార్చి 27న ధ్వజా రోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని తెలిపారు. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పట్టు వస్త్రాల సమర్పణ జరగనుందని చెప్పారు. ఈ సందర్భంగా టిటిడి జేఈవో వి.వీరబ్రహ్మం మాట్లాడుతూ, భక్తుల రద్దీ దృష్ట్యా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, గ్యాలరీలు, పార్కింగ్, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ వంటి ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని సూచించారు.

భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ఓఆర్ ఎస్ ప్యాకెట్లు పంపిణీ, అంబులెన్స్ సేవలు, నిరంతర విద్యుత్ సరఫరా, పుష్పాలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం, టిటిడి అధికారులతో జిల్లా కలెక్టర్, టిటిడి జేఈవో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, టిటిడి సీఈ సత్యనారాయణ, ఎస్ ఈలు మనోహరం, వేంక టేశ్వర్లు, డిప్యూటీ ఈవోలు రాజేంద్ర కుమార్, సెల్వం, శివప్రసాద్, అన్నప్రసాదం ప్రత్యేక అధి కారి జిఎల్ ఎన్ శాస్త్రి, అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

పశ్చిమాసియాలో యుద్ధం.. LPG గ్యాస్ కొరత..రైతులకు నష్టం

పశ్చిమాసియాలో యుద్ధం.. LPG గ్యాస్ కొరత..రైతులకు నష్టం

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కవిత

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కవిత

యుద్ధకాండలో చిదిగిపోతున్న పసిప్రాణాలు.. 200 మంది చిన్నారులు మృతి!

యుద్ధకాండలో చిదిగిపోతున్న పసిప్రాణాలు.. 200 మంది చిన్నారులు మృతి!

అమెరికా తీవ్ర హెచ్చరికతో ఇరాన్, లెబనాన్‌ లపై ఇజ్రాయెల్ దాడులు

అమెరికా తీవ్ర హెచ్చరికతో ఇరాన్, లెబనాన్‌ లపై ఇజ్రాయెల్ దాడులు

రాష్ట్రవ్యాప్తంగా రూ.6వేల కోట్లతో కొత్త సబ్ స్టేషన్లు

రాష్ట్రవ్యాప్తంగా రూ.6వేల కోట్లతో కొత్త సబ్ స్టేషన్లు

నార్త్ అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం

నార్త్ అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా  నిషేధం

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా  నిషేధం

నవంబర్​లోనే ఖమేనీని హతమార్చాలని అనుకున్నాం: రక్షణ మంత్రి

నవంబర్​లోనే ఖమేనీని హతమార్చాలని అనుకున్నాం: రక్షణ మంత్రి

ఇంగ్లాండ్ ఆటతీరు చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్

ఇంగ్లాండ్ ఆటతీరు చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్

‘తగ్గేదే లే’ అసలు ఆట ఇప్పుడే మొదలుపెట్టాం: అమెరికా

‘తగ్గేదే లే’ అసలు ఆట ఇప్పుడే మొదలుపెట్టాం: అమెరికా

ఆధునిక రీసెర్చ్ సంస్థగా ఎయిమ్స్.. డా. పెమ్మసాని

ఆధునిక రీసెర్చ్ సంస్థగా ఎయిమ్స్.. డా. పెమ్మసాని

📢 For Advertisement Booking: 98481 12870