ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం నుంచి వెనక్కి తగ్గేదే లేదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెథ్(Pete Hegseth) స్పష్టం చేశారు. అమెరికా సైనిక శక్తిని ఇరాన్ తక్కువ అంచనా వేస్తోందన్నారు. ఈ యుద్ధంలో అమెరికా నిలబడలేదని ఇరాన్ అనుకుంటోందని, తాము అసలు పోరాటాన్ని ఇప్పుడే మొదలుపెట్టామని ఆయన పేర్కొన్నారు. ఇక గల్ఫ్ ప్రాంత సముద్ర జలాల్లో అమెరికా నౌకా దళాలు వెనక్కి జరుగుతున్నాయనే ప్రచారాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ఖండించింది. యావత్ ఇరాన్ నేవీని సముద్రంలో ముంచేసే వరకు తమ మిషన్ ఆగదని తేల్చి చెప్పింది. గత 72 గంటల్లో ఇరాన్‌లోని దాదాపు 200 లక్ష్యాలపై అమెరికా బాంబర్ ఫోర్స్ వైమానిక దాడులు చేసిందని సెంట్‌కామ్ వెల్లడించింది. బి-2 స్పిరిట్ బాంబర్ విమానాల నుంచి కేవలం ఒక గంట వ్యవధిలోనే 2వేల పౌండ్ల (907 కేజీల) బరువున్న డజన్ల కొద్దీ పెనెట్రేటర్ బాంబులను బాలిస్టిక్ మిస్సైల్ లాంచ్ ప్యాడ్లపై వేశామని పేర్కొంది.
Read Also: Iran-Israel War: భారత్ వద్ద సరిపడా ఇంధన నిల్వలు

ఇరాన్‌పై పోరాటాన్ని కొనసాగిస్తాం
అమెరికా సంకల్పం ఎంత బలమైందో ఇరాన్ అర్థం చేసుకోలేకపోతోందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెథ్ అన్నారు. ఇరాన్‌పై తమ సైనిక చర్యను బలంగా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. వాషింగ్టన్‌లో విలేకరుల సమావేశం వేదికగా పీట్ హెగ్సెథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాను ఇరాన్ నేతలు, ఐఆర్‌జీసీ తక్కువ అంచనా వేస్తున్నాయని ఆయన చెప్పారు. తమ సంకల్పానికి కట్టుబడి ఉంటామని, ఇరాన్‌పై పోరాటాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. పూర్తి శక్తితో అమెరికా ఇప్పుడే దాడులను మొదలుపెట్టిందన్నారు. ఒకవేళ అవసరమైతే దీర్ఘకాలం పాటు ఈ యుద్ధాన్ని చేసేందుకూ అమెరికా సన్నద్ధమై ఉందని పేర్కొన్నారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో అరబ్ దేశాల నుంచి అమెరికాకు శరణార్ధులు క్యూ కట్టే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే అరబ్ శరణార్ధులకు అమెరికాలో ఆశ్రయాన్ని కల్పించే ఎలాంటి ప్రణాళికలూ ప్రస్తుతానికి తమకు లేవని అమెరికా రక్షణ మంత్రి తేల్చి చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: