हिन्दी | Epaper
25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ

Trump: అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు

Vanipushpa
Trump: అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు

పశ్చిమాసియా దేశాలపై అమెరికా దాడులు ఆగడం లేదు. ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై యుద్ధాన్ని ప్రారంభించిన మూడు రోజులకే మరో దేశాన్ని టార్గెట్ చేశాడు ట్రంప్. మధ్యప్రాచ్యంలో ఇరాన్‌పై యుద్ధాన్ని స్టార్ట్ చేసిన మూడు రోజుల తర్వాత మరో దేశపైకి సైన్యాన్ని మోహరించాడు. లాటిన్ అమెరికాలోని ఈక్వెడార్ ని లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించాడు. అక్కడ నిర్దేశిత ఉగ్రవాద సంస్థలుగా పేర్కొన్న నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులపై అమెరికా-ఈక్వెడార్ ఉమ్మడి సైనిక ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి. ప్రపంచం మొత్తం ఇరాన్ యుద్ధంపైనే దృష్టి పెట్టిన వేళ.. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా, వ్యూహాత్మకంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పటికే ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలోనే కాకుండా తన స్వంత MAGA వర్గాల నుంచీ విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్, మరోసారి అమెరికా సైనిక శక్తిని విదేశాల్లో వినియోగించడం గమనార్హం. మార్చి 3వ తేదీన.. ఈక్వెడార్ (Ecuador) సైనిక దళాలతో కలిసి అమెరికా దళాలు అక్కడి నార్కో-టెర్రరిజానికి వ్యతిరేకంగా ఆపరేషన్లు ప్రారంభించినట్లు US సదరన్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు X (ట్విట్టర్)లో అర్థరాత్రి పోస్ట్ విడుదల చేసింది.

Read Also: Tamil Nadu Elections 2026: టీవీకే అన్ని పార్టీలు ఓడిస్తుంది: విజయ్ ధీమా

America's next target is Ecuador..attacks have begun
America’s next target is Ecuador..attacks have begun

ఈక్వెడార్‌లో వరుస దాడుల్లో ఇది తొలి దశ

లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో నార్కో-టెర్రరిజం అనే మహా విపత్తును ఎదుర్కోవడంలో మా భాగస్వాముల నిబద్ధతకు ఇది ఉదాహరణ అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఆ పోస్ట్‌కు జత చేసిన వీడియోలో.. ఒక హెలికాప్టర్ సైనికులను తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వీడియోలో ప్రదేశం వెల్లడించకపోయినా, ఈక్వెడార్‌లో వరుస దాడుల్లో ఇది తొలి దశ అని అధికారులు సూచించారు. సదరన్ కమాండ్ జనరల్ ఫ్రాన్సిస్ ఎల్. డోనోవన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నార్కో-ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటంలో ఈక్వెడార్ సాయుధ దళాలు చూపుతున్న ధైర్యం, సంకల్పాన్ని ప్రశంసించారు. ఇరాన్‌పై యుద్ధంతో ఖాళీ అవుతున్న అమెరికా ఖజానా.. తొలి 24 గంటల్లోనే రూ. 7 వేల కోట్లకు పైగా ఖర్చు.. ఈ ఆపరేషన్లపై న్యూయార్క్ టైమ్స్ (New York Times) కీలక కథనం ప్రచురించింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. అమెరికా స్పెషల్ ఫోర్సెస్ సైనికులు నేరుగా దాడుల్లో పాల్గొనడం లేదని, అయితే ఈక్వెడార్ కమాండోలకు ప్రణాళికలు, నిఘా సమాచారం, లాజిస్టిక్స్ పరంగా సహకారం అందిస్తున్నారని ఒక అమెరికా అధికారి వెల్లడించారు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే.. ఇరాన్ యుద్ధం అమెరికా సైనిక వనరులపై తీవ్ర ఒత్తిడి తెస్తోందన్న ఆందోళనలు కూడా బయటకు వస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870