ఇటీవల ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ఆకాశ మార్గాలకూ ముప్పుగా మారుతున్నాయి. లాటిన్ అమెరికా(America) ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని జరుగుతున్న సైనిక కదలికలు, భద్రతా ఆందోళనల నేపథ్యంలో అమెరికా కీలక హెచ్చరిక జారీ చేయడం అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. సాధారణంగా యుద్ధ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే ఈ తరహా అలర్టులు… ఇప్పుడు మెక్సికో, సెంట్రల్ అమెరికా, తూర్పు పసిఫిక్ గగనతలం వరకు విస్తరించడం పరిస్థితుల తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తాజాగా అన్ని అమెరికన్ విమానయాన సంస్థలకు అడ్వైజరీ నోటీసులు జారీ చేసింది. మెక్సికో, సెంట్రల్ అమెరికా, పనామా సహా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని కీలక గగనతల ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించింది. సైనిక కార్యకలాపాల కారణంగా విమానాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని, విమానాల ఎత్తు ఎంత ఉన్నా-టేకాఫ్, ల్యాండింగ్ దశల్లోనూ ప్రమాదం తలెత్తవచ్చని ఎఫ్‌ఏఏ స్పష్టంగా హెచ్చరించింది. ఈ నోటీసులు కనీసం 60 రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి.
Read Also: India Exports: 9 నెలల్లో భారత్ ఎగుమతులు 634 బిలియన్ డాలర్లు

ట్రంప్ ప్రభుత్వ వైఖరి మరింత కఠినం
యుద్ధ సమయాల్లో ఇచ్చే ఆదేశాలు సాధారణంగా యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు లేదా సైనిక దాడుల భయం ఉన్నప్పుడు మాత్రమే ఈ తరహా హెచ్చరికలు జారీ చేస్తారు. అందుకే ఈ అడ్వైజరీలు ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా మెక్సికో, లాటిన్ అమెరికా దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఈ పరిణామాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి. మాదకద్రవ్యాల ముఠాలు, అక్రమ రవాణా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ ఇప్పటికే బహిరంగంగానే హెచ్చరించారు. మరింత కఠినంగా.. లాటిన్ అమెరికా దేశాల నుంచి మాదకద్రవ్యాలు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నాయన్న ఆరోపణలతో ట్రంప్ ప్రభుత్వ వైఖరి మరింత కఠినంగా మారింది. ఈ క్రమంలో వెనెజువెలాపై గతంలో జరిగిన సైనిక చర్యలు, ఆ దేశ రాజకీయ పరిణామాలు ఇప్పటికీ ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్నాయి. ఇప్పుడు అదే తరహా పరిస్థితులు మెక్సికో సహా ఇతర దేశాలపై కూడా ఉత్పన్నమవుతాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: