ఇరాన్ పై యుద్దాన్ని మరింత తీవ్రతరం చేస్తాం అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో యుద్దం మాకు బోర్ కొట్టదు అని, మా జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని, ప్రపంచంలోనే అమెరికా అత్యంత శక్తివంతమైనదని స్పష్టం చేశారు. ఇరాన్‌లో చెత్తను ఏరివేస్తున్నామని అన్నారు. యుద్ధం మరో నాలుగైదు వారాలు కొనసాగవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని ధ్వంసం చేయడం, నౌకాదళాన్ని నాశనం చేయడం, అణ్వాయుధాలు తయారుచేయకుండా అడ్డుకోవడం మా లక్ష్యం అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వంలోని చాలా మంది సభ్యులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.. వేలాది మంది ఫోన్ కాల్స్ చేసి వేడుకుంటున్నారు.. ఖమేనీ చనిపోయినప్పుడు చాలామంది రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు అని ట్రంప్ తెలిపారు.
Read Also: Middle East Conflict: మూడవ ప్రపంచ యుద్ధం దిశగా పశ్చిమాసియా?

ఇరాన్‌పై భీకర దాడులకు సన్నాహాలు
ఇరాన్‌పై త్వరలో మరిన్ని భీకర దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పటి వరకు తాము పెద్ద దాడులే చేయలేదన్నారు. అనుకున్నదాని కంటే ముందుగానే లక్ష్యాలను సాధిస్తున్నామని వెల్లడించారు. అరబ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడం ఆశ్చర్యం కలిగించిందని ట్రంప్ అన్నారు. 24గంటల్లో మా దాడులు ఉదృతం చేయనున్న నేపథ్యంలో అమెరికా పౌరులు పశ్చిమాసియాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని యూఎస్ విదేశాంగశాఖ సూచించింది. అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఎదురుదాడులు కొనసాగిస్తుంది. బహ్రెయిన్‌లోని ప్రముఖ కార్యాలయాలు, భవనాలపై ఇరాన్ క్షిపణి దాడులు సాగించింది. సీనియర్ అమెరికన్ మిలిటరీ కమాండ్ సిబ్బంది నివసిస్తున్నట్లు భావిస్తున్న భవనాలపై దాడి చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఖతార్ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఖతార్ ఎనర్జీ సంస్థను మూసివేసింది. ఖతార్ ఉత్పత్తి నిలిపివేయడంతో యూరప్ లో 50 శాతం గ్యాస్ ధరలు పెరిగాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో సౌదీలోని అరాంకో ఆయిల్ రిఫైనరీ మూత పడింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు చమురు కొరతను ఎదుర్కొనుండటంతో చమురు ధరలు 40శాతం పెరిగాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: