हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

Gaddi Balamukundam: శ్రీకాకుళంలో ఎసిబి సోదాలు

Rajitha
Gaddi Balamukundam: శ్రీకాకుళంలో ఎసిబి సోదాలు

Gaddi Balamukundam: జిల్లాలోని అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్గా పని చేస్తోన్న గడ్డి బాలముకుందం ఇంట్లో ఎసిబి అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని డిసిసిబి కాలనీలో గల బాలముకుందం ఇంట్లో ఎసిబి డిఎస్పీ సత్యన్నారాయణ ఆధ్వర్యంలో సిఐ భాస్కర్ ఇతర సిబ్బంది కలిసి సోదాలు చేశారు. బాలముకుందం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. కంచిలి బిసి హాస్టల్లో ఇటీవల ఎసిబి అధికారులు తనిఖీలు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడిన రూ.1,84,070లను గుర్తించారు. ఎబిసి డబ్ల్యుఓతో వసూళ్లకు పాల్పడ్డ వార్డెన్లపై విచారణ చేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఎసిబి అధికారులు పంపించారు.

Read also:Texas Shooting Incident: టెక్సాస్ బార్‌లో కాల్పుల కలకలం, ముగ్గురు మృతి!

ACB searches in Srikakulam

ACB searches in Srikakulam

బంగారం, వెండి వస్తువులతో పాటు నగదును గుర్తించారు.

ఎసిబి అధికారుల విచారణలో ఎబిసిడబ్ల్యుఓ బాలముకుందం అవినీతికి పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై ఎబిసిడబ్ల్యుఓపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా శ్రీకాకుళం నగరంలోని డిసిసిబి కాలనీలో నివాసం ఉంటున్న బాలముకుందం ఇంటిలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో బంగారం, వెండి వస్తువులతో పాటు నగదును గుర్తించారు. కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణను కొనసాగిస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎసిబి అధికారులు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870