భారత్, చైనా మధ్య 2020లో గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణ తర్వాత సైనిక ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఆ ఉద్రిక్తతలను తగ్గించడానికి దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది జరిగి ఏడాది గడవక ముందే చైనా మరో సరిహద్దు వివాదానికి తెరలేపింది. జమ్మూ కాశ్మీర్‌లోని వ్యూహాత్మక ప్రాంతమైన షాక్స్‌గామ్ వ్యాలీ (Shaxgam Valley)పై.. చైనా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. షాక్స్‌గామ్ వ్యాలీలో చైనా చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. వాటిని కపట డ్రాగన్ దేశం తోసిపుచ్చింది.అంతేకాకుండా.. షాక్స్‌గామ్ వ్యాలీలో చైనా రోడ్లు, ఇతర నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. దీనిపై ఇటీవల భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది.
Read Also: Odisha: స్నాక్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలి కంటిచూపు కోల్పోయిన బాలుడు

పాకిస్తాన్, చైనా మధ్య సరిహద్దు ఒప్పందం
షాక్స్‌గామ్ వ్యాలీ గ్రేటర్ కాశ్మీర్ ప్రాంతంలోని సియాచిన్ గ్లేసియర్‌కు ఉత్తరాన ఉంది. 1963లో పాకిస్తాన్, చైనా మధ్య సరిహద్దు ఒప్పందం ద్వారా ఈ ప్రాంతం చైనాకు వెళ్లిపోయింది. భారత్ మాత్రం ఆ ఒప్పందాన్ని చట్టవిరుద్ధమైనదని, చెల్లదని పేర్కొంటూ ఎన్నడూ గుర్తించలేదు. అప్పటినుంచి ఈ ప్రాంతం వివాదాస్పదంగా ఉంది. ఇటీవల అక్కడ చైనా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడంతో మరోసారి వివాదం చెలరేగింది.
భారతదేశ రక్షణలో అత్యంత కీలకమైనది
షాక్స్‌గామ్ వ్యాలీ సియాచిన్ గ్లేసియర్ పక్కన ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మిలిటరీ ఫ్రంట్‌లైన్ పాయింట్. ఇది భారతదేశ రక్షణలో అత్యంత కీలకమైనది. అంతేకాకుండా షాక్స్‌గామ్ వ్యాలీ ఎత్తైన పర్వత మార్గాలు, లాజిస్టికల్ మార్గాలకు పక్కన ఉంది. క్లిష్ట సమయాల్లో కారకోరం ప్రాంతంలో సైన్యాన్ని మోహరించడానికి షాక్స్‌గామ్ వ్యాలీ కీలకంగా మారుతుంది. అయితే అఘిల్ పాస్ సమీపంలో చైనా రోడ్లు, మార్గాలు నిర్మిస్తోంది. వీటి ద్వారా చైనా తన బలగాలను.. సియాచిన్ సమీపంలోని భారత మిలిటరీ పాయింట్లకు దాదాపు 50 కి.మీ. దూరంలోకి తీసుకురాగలదని నిపుణులు చెబుతున్నారు. ఇలా జరిగితే సరిహద్దుల వెంట సెక్యూరిటీ బ్యాలన్స్ మారి.. భారత ఆధిపత్యం తగ్గుతుందని అంటున్నారు. అందుకే చైనా చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: