हिन्दी | Epaper

Bangalore: జూనియర్లపై రెచ్చిపోయిన సీనియర్లు..23 మంది పై కేసు

Vanipushpa
Bangalore: జూనియర్లపై రెచ్చిపోయిన సీనియర్లు..23 మంది పై కేసు

జూనియర్‌ విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. డ్రింక్స్, సిగరెట్లు తీసుకురావాలని బలవంతం చేశారు. తమ ఆదేశాలు పాటించని జూనియర్లను కొట్టారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. (College Students Assault Juniors) కర్ణాటక రాజధాని బెంగళూరు(Bangalore)లో ఈ సంఘటన జరిగింది. దేవనహళ్లి ప్రాంతంలోని ఆకాష్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్‌కు చెందిన సీనియర్ విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. బీబీఏ, బీసీఏ విద్యార్థులను వేధించారు.
కాగా, జనవరి 15న సాయంత్రం 5 గంటల సమయంలో సిగరెట్లు, కూల్‌డ్రింక్స్‌ తీసుకురావాలని జూనియర్లను సీనియర్లు బలవంతం చేశారు. తమ మాట వినని జూనియర్లపై సీనియర్లు దాడి చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న అడ్మిషన్స్ హెడ్ మిదున్ మాధవన్ సీనియర్‌ విద్యార్థులను ప్రశ్నించేందుకు క్యాంపస్ వెనుక ఉన్న టీ స్టాల్‌ వద్దకు వెళ్లారు.

Read Also: China: డ్రైవర్ లేని బస్సులు..సాంకేతిక అద్భుతం

ఇనుపరాడ్లు, కర్రలు, రాళ్లతో జూనియర్లపై దాడులు

అయితే ఈ సందర్భంగా సీనియర్‌ విద్యార్థులు రెచ్చిపోయారు. ఇనుపరాడ్లు, కర్రలు, రాళ్లతో జూనియర్లపై దాడులకు పాల్పడ్డారు. సీనియర్‌ స్టూడెంట్‌ బిలాల్ ఒక జూనియర్‌ మెడలో ఉన్న 32 గ్రాముల బంగారు గొలుసును లాక్కున్నాడు. సీనియర్ల దాడిలో కొందరు జూనియర్లు గాయపడ్డారు. మరోవైపు ఆకాష్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్‌ అడ్మిషన్స్ హెడ్ మిదున్ మాధవన్ దీనిపై స్పందించారు. జూనియర్లపై ర్యాగింగ్‌, వేధింపులకు పాల్పడిన సీనియర్లపై దేవనహళ్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో 23 మంది సీనియర్‌ విద్యార్థులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

📢 For Advertisement Booking: 98481 12870