हिन्दी | Epaper

Kerala: శబరిమల బంగారం చోరీ కేసులో కీలక మలుపు..ఆలయ సిబ్బంది అకౌంట్లపై దర్తాప్తు

Vanipushpa
Kerala: శబరిమల బంగారం చోరీ కేసులో కీలక మలుపు..ఆలయ సిబ్బంది అకౌంట్లపై దర్తాప్తు

కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం దొంగతనం కేసు పలు కీలక మలుపులు తిరుగుతోంది. బంగారం చోరీ కేసులు రోజు రొజుకు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. శబరిమల (Sabarimala) ఆలయంలోని విలువైన కళాఖండాల నుండి Gold దొంగిలించబడిందనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో.. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న దర్యాప్తులో ఆలయ ఉద్యోగుల ఖాతాల్లో అనుమానాస్పద నగదు లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలి వార్షిక పండుగ సీజన్‌లో విధుల్లో ఉన్న ఉద్యోగుల ఆర్థిక వ్యవహారాల్లో భారీ అసమానతలు కనిపించడంతో, ఈ వ్యవహారం మరింత తీవ్రతను సంతరించుకుంది. నవంబర్ 15 నుంచి జనవరి 20 వరకు కొనసాగిన రెండు నెలల మాండల-మకర విలక్కు పండుగ సీజన్‌లో ఆలయంలో విధులు నిర్వహించిన సిబ్బంది ఆర్థిక కార్యకలాపాలపై శబరిమల ప్రత్యేక కమిషనర్ సమర్పించిన నివేదికను కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ సమీక్షించింది. ఈ నివేదికలో ఆలయ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, పోస్టాఫీసుల ద్వారా జరిగిన నగదు బదిలీలు, అలాగే ఆ నిధుల మూలాలపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Read Also: Andhra Pradesh: ‘భూముల’బిల్లుకు కేబినెట్ ఓకే

Kerala: శబరిమల బంగారం చోరీ కేసులో కీలక మలుపు..ఆలయ సిబ్బంది అకౌంట్లపై దర్తాప్తు
Kerala: శబరిమల బంగారం చోరీ కేసులో కీలక మలుపు..ఆలయ సిబ్బంది అకౌంట్లపై దర్తాప్తు

విజిలెన్స్ అధికారి కోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం..

ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది. ఆలయ పరిధిలో పనిచేస్తున్న వివిధ బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి లావాదేవీల పూర్తి వివరాలు సేకరించాలని, అలాగే పండుగ సీజన్‌లో సన్నిధానంలో విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి డేటాబేస్‌ను రూపొందించాలని కోర్టు స్పష్టంగా పేర్కొంది. ఆలయ పరిధిలోని పోస్టాఫీసులు, బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం తీవ్ర అనుమానాలకు తావిచ్చే లావాదేవీలను వెల్లడించింది. కేవలం తక్కువ వ్యవధిలోనే పోస్టాఫీసు మనీ ఆర్డర్ల ద్వారా మొత్తం రూ.14,08,880 బదిలీ అయినట్లు విచారణలో తేలింది. ఈ మొత్తానికి సంబంధించి నిధుల మూలం, చట్టబద్ధతపై స్పష్టత లేకపోవడం తీవ్ర సందేహాలకు దారి తీసిందని విజిలెన్స్ అధికారి కోర్టుకు తెలిపారు. శబరిమలలో రూ. వేల కోట్ల బంగారం మాయం..

ED దర్యాప్తులో బయటపడుతున్న సంచలన నిజాలు

కోర్టు పరిశీలనలో ఒక ఉద్యోగి పోస్టాఫీసు ద్వారా రూ.1,38,000 పంపగా.. మరొక ఉద్యోగి రూ.1,07,450 పంపినట్లు గుర్తించారు. అంతేకాదు, మరో ముగ్గురు ఉద్యోగుల ఖాతాల్లో కూడా ఇదే తరహా నగదు బదిలీ నమూనాలు కనిపించాయి. ఈ ఉద్యోగులను విచారణకు హాజరుకావాలని విజిలెన్స్ అధికారులు ఆదేశించినప్పటికీ.. వారు ఆ ఆదేశాలను పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ పరిస్థితుల్లో సంబంధిత బ్యాంకులు, పోస్టల్ అధికారుల నుంచి లావాదేవీల పూర్తి వివరాలు సేకరించడం, ప్రతి అనుమానాస్పద లావాదేవీ వెనుక ఉన్న కారణాలను లోతుగా పరిశీలించడం అత్యవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. అనుమానాస్పదంగా ఉన్న ప్రతి నిధి బదిలీపై వివరాలను సేకరించి, అవసరమైతే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కోర్టుకు హామీ ఇచ్చింది. అసలు ఈ కేసు ఏంటంటే..ఆలయంలో ఉపయోగించే కొన్ని సంప్రదాయ అలంకరణ వస్తువులు, కళాఖండాలు గతంతో పోలిస్తే తక్కువ బరువుగా ఉన్నాయన్న అనుమానాలు మొదట కనిపించాయి. భక్తులు సమర్పించిన విలువైన బంగారం భాగాలుగా మారిపోయి ఉండొచ్చన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఆస్తుల భద్రత, నిర్వహణలో లోపాలున్నాయా అనే అంశంపై హైకోర్టు స్వతంత్ర విచారణకు ఆదేశించింది. ఈ విచారణను పర్యవేక్షించేందుకు శబరిమల ప్రత్యేక కమిషనర్‌ను నియమించారు. ప్రత్యేక కమిషనర్ సమర్పించిన నివేదికలో కొన్ని కీలక అంశాలు బయటపడ్డాయి. ఆలయంలోని కొన్ని వస్తువుల బరువు, విలువలకు సంబంధించిన సరైన రికార్డులు లేకపోవడం, పాత ఇన్వెంటరీతో కొత్త లెక్కల మధ్య తేడాలు ఉండటం వంటి విషయాలు కోర్టును ఆందోళనకు గురిచేశాయి. ఇవన్నీ బంగారం దొంగతనం జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని మరింత బలపరిచాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870