हिन्दी | Epaper

AI: AI రీప్లేస్ చేయబోయే జాబ్స్ లిస్ట్ బయటపెట్టిన మైక్రోసాఫ్ట్!

Vanipushpa
AI: AI రీప్లేస్ చేయబోయే జాబ్స్ లిస్ట్ బయటపెట్టిన మైక్రోసాఫ్ట్!

టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ. ముఖ్యంగా ‘సీడెన్స్ 2.0’ (Seedance 2.0) వంటి టూల్స్ క్రియేటివ్ రంగంలో సృష్టిస్తున్న సంచలనం చూస్తుంటే.. పెద్ద పెద్ద స్టూడియోలకే నిద్ర పట్టడం లేదు. కేవలం క్రియేటివ్ రంగమే కాదు, ఆఫీసుల్లో కూర్చుని పనిచేసే వైట్ కాలర్ ఉద్యోగులకు (White Collar Jobs) కూడా AI రూపంలో గండం పొంచి ఉందనే వార్తలు కలవరపెడుతున్నాయి. మరి నిజంగానే 2026 చివరి నాటికి ఏఐ మన ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుందా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? 12 నుంచి 18 నెలల్లో భారీ మార్పులు! మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ముస్తాఫా సులేమాన్ వంటి ప్రముఖ టెక్ దిగ్గజాల ప్రకారం.. స్క్రీన్ ఆధారంగా చేసే నాలెడ్జ్ వర్క్ (Screen-based knowledge work) మెజారిటీ భాగం వచ్చే 12 నుంచి 18 నెలల్లో ఆటోమేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే 2026 చివరి నాటికి లేదా 2027 ఆరంభం నాటికి మనకు స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇప్పటికే కస్టమర్ సర్వీస్, రైటింగ్, డేటా అనాలిసిస్ వంటి విభాగాల్లో AI ప్రభావం మొదలైంది.

Read Also: Prathyusha death case: ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి లభించని ఊరట!

AI: AI రీప్లేస్ చేయబోయే జాబ్స్ లిస్ట్ బయటపెట్టిన మైక్రోసాఫ్ట్!
AI: AI రీప్లేస్ చేయబోయే జాబ్స్ లిస్ట్ బయటపెట్టిన మైక్రోసాఫ్ట్!

ప్రమాదంలో ఉన్న ఉద్యోగాలు ఏవి?

మైక్రోసాఫ్ట్ , ఇతర టెక్ సంస్థల విశ్లేషణ ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రభావితం కాబోయే లేదా పూర్తిగా భర్తీ చేయబడే కొన్ని కీలక వృత్తుల జాబితా ఇక్కడ ఉంది: రైటర్స్, ఎడిటర్స్: కంటెంట్ రాయడం, ప్రూఫ్ రీడింగ్ చేయడం. కస్టమర్ సర్వీస్: కాల్ సెంటర్లు, చాట్ సపోర్ట్ ప్రతినిధులు. డేటా సైంటిస్ట్స్, అనలిస్ట్స్: గణాంకాలను విశ్లేషించే వారు. వెబ్ డెవలపర్స్: బేసిక్ కోడింగ్, వెబ్ డిజైనింగ్. ట్రాన్స్‌లేటర్లు: ఒక భాష నుంచి మరో భాషలోకి అనువదించే వారు. మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్స్: మార్కెట్ ట్రెండ్స్ అంచనా వేసే వారు. అడ్వర్టైజింగ్ సేల్స్ ఏజెంట్స్: ప్రకటనల విక్రయదారులు.

ఇదంతా 100 శాతం నిజమేనా?

అయితే ఇదంతా వంద శాతం నిజమే అని ఖచ్చితంగా చెప్పలేం! ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్న మాట వాస్తవమే. అయినా అది కేవలం మెకానికల్ గా లేదా రొటీన్ గా చేసే పనులకే పరిమితం కావచ్చు. ఒక వ్యక్తిలో ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యం (Skillset), క్రియేటివ్ థింకింగ్, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉంటే వారి ఉద్యోగం సేఫ్ గానే ఉంటుంది. ముఖ్యంగా క్లయింట్‌లతో నేరుగా మాట్లాడటం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌తో నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులను ఏఐ అంత త్వరగా చేయలేదు. కేవలం గూగుల్ నుంచో లేదా చాట్ జిపిటి నుంచో సమాచారం కాపీ చేసి ఇచ్చే వారికి మాత్రమే ముప్పు పొంచి ఉంది. అయితే ఇక్కడ ఏఐని ఒక విలన్ లా చూడడం కరెక్ట్ కాదు. దాన్ని ఒక సాధనంలా చూడాలి. దా

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870