డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ వెనెజువెలా(Venezuela) మీదా అమెరికా అధ్యక్షుడు ట్రంఫ్ గత కొంతకాలంగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆ దేశ రాజధాని కరాకస్ లో భారీ పేలుళ్లు చోటుచేసుకోవడం కలకలం రేపింది. నిమిషాల వ్యవధిలో ఏడు ప్రాంతాల్లోఈ పేలుళ్లు సంభవించాయి. విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్న శబ్దాలు వినిపించాయని స్థానికులు పేర్కొన్నట్లు ఆదేశ మీడియా తెలిపింది. డ్రగ్స్ ను తరలిస్తున్న బోట్స్, జలాంతర్గాములపై అమెరికా దాడులను ముమ్మరం చేసింది. ఈ పరిణామాల నడుమ తాజాగా వెనెజువెలాలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున పేలుడు శబ్దాలు వినిపించడంతో.. ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.

మాదకద్రవ్యాల కార్యకలాపాలతో తమకు ఎలాంటి సంబంధాలు లేవు
కాగా, అమెరికా సైన్యం విడుదల చేసిన వివరాల ప్రకారం.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు అమెరికా 30 వరకు దాడులు చేసిందన్నారు. ఈ దాడుల్లో 107 మంది మరణించినట్లు తెలిపింది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో మాత్రం మాదకద్రవ్యాల కార్యకలాపాలతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొనడం గమనార్హం. తమదేశంలో ఉన్న అతిపెద్ద చమురు నిల్వలు, అరుదైన భూమి ఖనిజ సంపద కోసం ట్రంప్ తనను అధికారం నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా.. ఇప్పటి వరకూ వెనెజువెలా ప్రభుత్వం కానీ, అమెరికా కానీ ఈ పేలుళ్లపై స్పందించకపోవడం గమనార్హం. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుజులాకు గతంలోనే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ దేశ గగనతలంపైనా ట్రంప్ ఆంక్షలు విధించారు. రోడ్డు, సముద్ర మార్గం ద్వారా అమెరికాలోకి డ్రగ్స్ రవాణా నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కరేబియన్ దీవుల్లో తమ యుద్ధనౌకలు మోహరించి ఉన్నాయని వాటిపై దాడి చేస్తామని హెచ్చరించాడు. అంతే కాకుండా వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో పదవికి రాజీనామా చేయాలని హెచ్చిరించాడు. ఇక తాజాగా ట్రంప్ చెప్పినట్టుగానే వెనుజులాపై మెరుపు దాడులు మొదలయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: