ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు(Netanyahu) కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సోమవారం తెలిపింది. ‘ఆశ్చర్యకరమైన’ క్షిపణి దాడి చేసినట్లు పేర్కొంది. (Iran Targets Netanyahu’s Office) ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండర్ ఉన్న ప్రదేశాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని మిసైల్ ఎటాక్ చేసినట్లు వెల్లడించింది. తమ దాడుల తర్వాత నెతన్యాహుకు సంబంధించిన సమాచారం అస్పష్టంగా ఉన్నదని ఇరాన్ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.
Read Also: Women Soldiers: ఇరాన్ సైన్యంలో మహిళా సైనికుల పాత్ర ?

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడులు
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతున్నది. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆర్మీ, నేవీ బేస్‌లపై దాడులను ఉధృతం చేసింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై దాడులను తీవ్రం చేశాయి. ఇరాన్లో ఇప్పటి వరకు 555 మంది మరణించారు. ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి 131 నగరాలపై దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: