పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్(Bharath) పాకిస్థాన్(Pakistan) మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో భారత్ – పాకిస్థాన్ తమ అణు శక్తి కేంద్రాల సమాచారాన్ని పంచుకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలగా వస్తున్న ఒప్పందం ప్రకారం వార్షిక అణు కేంద్రాల జాబితాను ఇరు దేశాలు ఇచ్చి పుచ్చుకున్నాయి. ఇరు దేశాలు ఒకదాన్నొకటి అణ్వాయుధాలతో దాడులు చేసుకోవడాన్ని నిషేధిస్తూ భారత్- పాకిస్థాన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. భారత్- పాకిస్థాన్ మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇరు దేశాలు తమ వార్షిక అణ్వాయుధ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలగా వస్తున్న ఒప్పందం ప్రకారం ఈ దేశాలు తమ అణ్వాయుధాల సమాచారాన్ని ట్రాన్స్ ఫర్ చేసుకున్నాయి.
Read Also: NewYear: ప్రపంచ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో రద్దులు

స్పష్టం చేసిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ
ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇదే విషయంపై భారత్- పాకిస్థాన్ మధ్య డిసెంబర్ 31, 1988లో ఒప్పందం జరిగింది. ఆ విధానం జనవరి 27, 1991 నుంచి అమల్లోకి వచ్చింది. ఇలా రెండు దేశాలు తమ అణుశక్తి కేంద్రాల సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం ఇది వరుసగా 35వ సారి అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జనవరి 1, 1992 నుంచి ఈ విధానం కొనసాగుతోందని పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా పవర్ ప్లాంట్స్, రీసెర్చ్ రియాక్టర్స్, ఫ్యూయల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్, ఎన్ రిచ్ మెంట్ ఫెసిలిటీస్, ఐసోటోప్ సెపరేషన్ ప్లాంట్స్, రీ ప్రాసెసింగ్ యూనిట్స్, స్టోరేజీ సైట్స్ , రేడియోయాక్టివ్ మెటీరియల్స్ డీటెయిల్స్.. తదితర పూర్తి సమాచారాన్ని భారత్- పాకిస్థాన్ ఇచ్చిపుచ్చుకున్నాయి. వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: