445 మంది మందుబాబుల పట్టివేత
హైదరాబాద్: జంట నగరాలలో మందుబాబుల భరతం పట్టేందుకు డ్రంకన్ డ్రైవ్ దాడులు కొనసాగుతూనే వున్నాయి. శుక్రవారం, శనివారం రాత్రుల్లో ట్రాఫిక్ పోలీసులు పలుచోట్ల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ దాడుల్లో మొత్తం 445 మంది మందుబాబులు పట్టుబడ్డారు. వీరిలో 377 మంది ద్విచక్ర వాహనదారులు, 22 మంది ఆటో డ్రైవర్లు, 46 మంది కార్ల డ్రైవర్లు వున్నారు. పట్టుబడ్డ వారిలో 100 మంది 30 నుంచి 50 పాయింట్ల వరకు, 191 మంది 51 నుంచి 100 పాయింట్ల వరకు, 84 మంది 101 నుంచి 150 పాయింట్ల వరకు, 39 మంది 151 నుంచి 200 పాయింట్ల వరకు, 12 మంది 201 నుంచి 250 పాయింట్ల వరకు, తొమ్మిది మంది 251 నుంచి 300 పాయింట్ల వరకు, 10 మంది 300 పాయింట్లకు మించి విపరీతంగా మద్యం సేవించినట్లు తేలింది.
Read also: PG doctor suicide : దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

Hyderabad Drunken Drive: Ongoing drunken drive attacks
వీరిని అరెస్టు చేసిన తరువాత వారి వాహనాలు జప్తు చేసి, కేసులు నమోదు చేశాక సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. వీరికి కౌన్సిలింగ్ నిర్వహించిన తరువాత కోర్టుల్లో హాజరుపరుస్తారు. కోర్టులు వీరికి శిక్షలు విధిస్తాయని నగర జాయింట్ ట్రాఫిక్ పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ మీడియాకు తెలిపారు. జంట నగరాలలో డ్రంకన్రైవ్ దాడులు నిరంతరం కొనసాగుతాయని, వీటిని పూర్తిస్థాయిలో అరికడతామని ఆయన వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: