అంతర్జాతీయంగా భద్రతా పరిస్థితులు రోజురోజుకు మరింత సంక్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో.. కేంద్ర బడ్జెట్ 2026లో రక్షణ రంగాని(Defence Sector)కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పరిశ్రమల సంఘం FICCI కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేసింది. పెరిగిన భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సంఘర్షణలు, సాంకేతిక ఆధారిత యుద్ధాల ముప్పు దృష్ట్యా.. రక్షణ రంగంలో ఉత్పాదక మూలధన వ్యయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని FICCI తన ప్రీ-బడ్జెట్ మెమోరాండంలో పేర్కొంది. భారతదేశపు బయట భద్రతా వాతావరణం ప్రస్తుతం తీవ్రమైన అనిశ్చితితో నిండి ఉందని తెలిపింది. ప్రత్యర్థి దేశాలు స్వయంచాలక ఆయుధాలు, హైపర్‌సోనిక్ మిసైళ్లు, UAV స్వార్మ్‌లు, కృత్రిమ మేధస్సు ఆధారిత యుద్ధ సాంకేతికతల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని FICCI హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో భారతదేశం తన ప్రాదేశిక సమగ్రతను, వ్యూహాత్మక స్వావలంబనను కాపాడుకోవాలంటే బలమైన, ఆధునిక, సాంకేతికంగా సన్నద్ధమైన రక్షణ నిర్మాణం అవసరమని స్పష్టం చేసింది.
Read Also: Ukraine: రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్స్కీ

భవిష్యత్తు యుద్ధాలు భూమి, గాలి, సముద్రం, సైబర్, అంతరిక్షం, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం వంటి బహుళ డొమైన్‌లలో జరుగుతాయని. అందుకు తగినట్లుగా నెట్‌వర్క్ ఆధారిత, AI సమగ్ర సామర్థ్యాలను అభివృద్ధి చేయాలని సూచించింది. ఇందులో భాగంగా రక్షణ బడ్జెట్ 2026లో నాలుగు ప్రధాన దిశలను సూచించింది FICCI. 1. మూలధన వ్యయం పెంపు: 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ మంత్రిత్వ శాఖకు రూ. 6.81 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు చేసినప్పటికీ.. మొత్తం బడ్జెట్‌లో మూలధన వ్యయం వాటాను 26 శాతం నుంచి కనీసం 30 శాతానికి పెంచాలని FICCI సూచించింది.
DRDOకి బలమైన మద్దతు
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)కి కేటాయింపులను మరింత పెంచాలని FICCI అభిప్రాయపడింది. రాబోయే బడ్జెట్‌లో అదనంగా రూ. 10 వేల కోట్ల నిధులు కేటాయిస్తే.. ప్రైవేట్ రంగంతో కలిసి డీప్ టెక్, ఫ్రంటియర్ టెక్నాలజీలపై పరిశోధనకు మరింత ఊతం లభిస్తుందని తెలిపింది. ఆదాయం పెరిగి.. పన్నులు తగ్గుతాయా? ఈ సారి బడ్జెట్‌లో ఈ మూడు అంశాలే కీలకం! 3. రక్షణ పారిశ్రామిక కారిడార్లు: ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఏర్పాటైన రక్షణ పారిశ్రామిక కారిడార్లతో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్న FICCI.. తూర్పు భారతదేశంలో మరో రక్షణ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇది ఉద్యోగాల సృష్టి, పరిశోధనాభివృద్ధి, ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని తెలిపింది. 4. రక్షణ ఎగుమతుల ప్రోత్సాహం: గత కొన్నేళ్లలో వేగంగా పెరుగుతున్న రక్షణ ఎగుమతులను మరింత పెంచేందుకు ప్రత్యేక వ్యూహం అవసరమని FICCI సూచించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: