हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

Epstein Files: బాలీవుడ్‌ను వణికిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’

Vanipushpa
Epstein Files: బాలీవుడ్‌ను వణికిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’

ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు, సినిమా, వ్యాపార రంగాలకు చెందిన పెద్ద పెద్ద వ్యక్తులను షేక్ చేస్తున్న అంశం ఎప్‌స్టీన్ ఫైల్స్. ఈ కేసు గురించి ఎన్నేళ్లుగా చర్చ జరుగుతున్నా, తాజాగా ఒక్కొక్కటిగా రహస్య డాకుమెంట్స్ బయటకు రావడంతో మళ్లీ సంచలనం మొదలైంది. ఇప్పటివరకు మౌనంగా ఉన్న సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు స్పందిస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం బాలీవుడ్‌కి కూడా చేరింది. హిందీ సినిమా రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖుల పేర్లు ఎప్‌స్టీన్ ఫైల్స్‌(Epstein Files)లో ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వారే దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్, ప్రముఖ రచయిత దీపక్ చోప్రా. దీంతో బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

Read Also: India: మలేషియాకు బయలుదేరిన మోదీ

Epstein Files: బాలీవుడ్‌ను వణికిస్తున్న 'ఎప్‌స్టీన్ ఫైల్స్'
Epstein Files: బాలీవుడ్‌ను వణికిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’

అసలు ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటే ఏమిటి?

ఎప్‌స్టీన్ నిర్వహించిన ఓ ఈవెంట్ కోసం అనురాగ్ కశ్యప్ 2017లో బీజింగ్ వెళ్లాడంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన అనురాగ్ కశ్యప్, “నాకు చాలా ఆహ్వానాలు వస్తాయి. కానీ నేను ఇప్పటివరకు జీవితంలో ఒక్కసారి కూడా బీజింగ్ వెళ్లలేదు” అంటూ స్పష్టంగా ఖండించారు. ఇక దీపక్ చోప్రా మాట్లాడుతూ, “నేను ఎప్పుడూ ఎలాంటి నేరపూరిత పనుల్లో పాల్గొనలేదు. ఎప్‌స్టీన్‌తో నా పరిచయం చాలా పరిమితమే. లైంగిక నేరాల విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు” అని చెప్పారు. అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలనే ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటారు. ఎప్‌స్టీన్ ఓ అమెరికన్ బిలియనీర్. అతను మైనర్ బాలికలను లైంగిక అక్రమ రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలింది. 2019లో జైలులో ఉన్న సమయంలో ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు విచారణలో సేకరించిన కోర్టు పత్రాలు, సాక్ష్యాలు, విమాన ప్రయాణ వివరాలు, కాంటాక్ట్ లిస్టులను అమెరికా ప్రభుత్వం ఇప్పుడు విడతల వారీగా బయటకు తీస్తోంది. ఈ పత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న వ్యక్తుల పేర్లు ఉండటంతో కలకలం రేగుతోంది. అయితే ఫైల్స్‌లో పేరు ఉండటం మాత్రమే నేరానికి రుజువు కాదు. కొందరు ఎప్‌స్టీన్‌కు తెలిసినవారు, కొందరు అతని విమానంలో ప్రయాణించినవారు మాత్రమే.

మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం

ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఫైల్స్‌ను పూర్తిగా విడుదల చేయాలనే బిల్లుపై సంతకం చేశారు. దీని వల్ల దాదాపు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, 2000కు పైగా వీడియోలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ వివాదం ఇంకా పెద్ద స్థాయిలో చర్చకు రావడం ఖాయం. ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఒక వైపు ఉంటే, నిరపరాధుల గోప్యతను కాపాడాల్సిన బాధ్యత మరోవైపు ఉంది. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యం పాటించకపోతే, నిజం దాచేస్తున్నారన్న అనుమానం పెరుగుతోంది. మొత్తానికి ఎప్‌స్టీన్ ఫైల్స్ ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. మరిన్ని పేర్లు, మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో, ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలాకాలం చర్చలో ఉండనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

కాకినాడ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 50 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తింపు.

కాకినాడ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 50 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తింపు.

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

📢 For Advertisement Booking: 98481 12870